సార్వత్రిక ఎన్నికలు ముగియగానే వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ సేల్స్ ట్యాక్స్‌ను సవరణ చేసింది. దీంతో పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. కర్ణాటకలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సుమారు రూ. 3 నుంచి రూ. 3.05 వరకు పెరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Haryana: “జిహాదీల చావుకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం”.. హర్యానలోఉగ్రవాదుల దాడి బెదిరింపు లేఖ
శనివారం రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం… కర్ణాటక సేల్స్ ట్యాక్స్ పెట్రోల్‌పై 25.92 శాతం నుంచి 29.84 శాతానికి, డీజిల్‌పై 14.3 శాతం నుంచి 18.4 శాతానికి పెంచింది. దీంతో కర్ణాటక పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకారం.. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.102.86 కాగా, డీజిల్ ధర రూ.88.94గా ఉండనుంది. పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Swetha Menon: ‘రతినిర్వేదం’ హీరోయిన్ అప్పటికన్నా ఇప్పుడే బావుందే.. లేటెస్ట్ పిక్స్ చూశారా?
ఐదు హామీల అమలు కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంధన ధరల పెంపు వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2,500-రూ.2,800 కోట్లు సమీకరించవచ్చని ఆర్థిక శాఖ భావిస్తోంది.