HD Kumaraswamy : కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ ఎన్నికల్లో గెలవాలని తమ ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. ప్రచారాలు సభలు జోరుగా సాగుతున్నాయి. లోకల్ లీడర్లనుంచి జాతీయ నాయకుల వరకు ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో మాజీ ముఖ్యమంత్రి అనారోగ్యం పాలయ్యారు. ఈ కారణంగా మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి హాస్పిటల్‌లో చేరారు. శనివారం సాయంత్రం ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారరు.
Read Also : Viral : జాతీయ జెండాతో చికెన్‌ను శుభ్రపరిచిన వ్యక్తి, అరెస్ట్
ఎన్నికల సీజన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుమారస్వామి విస్తృత పర్యటనలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన అనారోగ్యం బారిన పడినట్టు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో కుమారస్వామి ఆదివారం రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలు అన్నింటినీ వాయిదా వేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు తన ఆరోగ్యం గురించి కలత చెందరాదని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా తాను అనారోగ్యం బారిన పడటంతో వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు వివరించారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో తాను హాస్పిటల్‌లో జాయిన్ అయినట్టు తెలిపారు.
Read Also : Amit Shah : అమిత్ షా పర్యటనలో మార్పులు, ఆర్ఆర్ఆర్ టీమ్‌తో భేటీ రద్దు