ఈ మధ్య జనాలు క్రియేటివిటీ పేరుతో ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు.. ఫెమస్ కోసం కొంతమంది ఇలా చేస్తే.. మరికొంతమంది తమ భాగస్వామీతో చేసే ప్రతిదీ జీవితాంతం గుర్తుండాలని చెబుతున్నారు.. అర్థం కావడం లేదు కదా.. ఇటీవల కాలంలో జరిగే పెళ్లిళ్లను చూస్తే ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ అంటూ జనాలు రకరకాల థిమ్ లను ఎంపిక చేసుకుంటున్నారు.. మొన్న ఓ జంట పాముతో ఫోటో షూటింగ్ చేస్తే.. మరో జంట అర్ధరాత్రి దెయ్యాలుగా ఫోటోలను దిగారు.. ఇలా రోజుకో ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు తాజాగా మరో ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇద్దరు డాక్టర్లు తమ వృత్తిని కూడా చూపించే విధంగా ఆపరేషన్ థియేటర్లో ఫోటోషూట్ చేశారు.. వార్నీ ఇదేం పిచ్చి రా బాబు అనుకుంటున్నారు కదా.. అవును ఇది నిజంగానే జరిగింది.. కర్ణాటక లో ఈ విచిత్రమ్ జరిగింది.. చిత్రదుర్గ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ ప్రాతిపాదికన ఓ వైద్యుడు పని చేస్తున్నాడు. అతనికి ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. వినూత్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకున్న అతను.. తన కాబోయే భార్యతో కలిసి ఆసుపత్రికి వచ్చాడు. ఓ డమ్మీ రోగిని బెడ్‌పై పడుకోబెట్టి.. ఆపరేషన్ చేస్తున్నట్లు నటించి.. ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకున్నారు..
వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా క్షణాల్లో వైరల్ అయ్యింది.. ఆపరేషన్ థియేటర్‌లో ఫొటోషూట్ ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. వీడియో కాస్తా జిల్లా వైద్యాధికారుల దృష్టికి వెళ్లింది.. ఇక అంతే సంబంధిత అధికారులు అతన్ని వివరణ కోరి అనంతరం ఉద్యోగాన్ని పీకేశారు.. ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజల ఆరోగ్యం కోసం ఉన్నాయని, వ్యక్తిగత పనుల కోసం కాదని వివరించారు..