Congress MLA KC Veerendra Arrested: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సి. వీరేంద్రను శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్టు చేశారు. శుక్రవారం, వీరేంద్రకు చెందిన అనేక ప్రదేశాలపై ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. దాడుల్లో రూ.12 కోట్లకు పైగా నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఒక కోటి కంటే ఎక్కువ విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నారు.
READ MORE: Kukatpally Sahasra case : క్రికెట్ బ్యాట్ దొంగిలించడానికి వెళ్లి హత్య చేసిన బాలుడు
బెంగళూరులోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆగస్టు 22- 23 తేదీలలో దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆపరేషన్ చేపట్టింది. అక్రమ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ రాకెట్‌ను ఛేదించింది. ఈ కేసు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఎమ్మెల్యే కెసి వీరేంద్ర, అతని సన్నిహితులకు సంబంధించినది. గ్యాంగ్‌టక్, చిత్రదుర్గ, బెంగళూరు, హుబ్లి, జోధ్‌పూర్, ముంబై, గోవా సహా 31 ప్రదేశాలలో ఈడీ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. గోవాలో కూడా పప్పీస్ క్యాసినో గోల్డ్, ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ 7 క్యాసినో, బిగ్ డాడీ క్యాసినో అనే ఐదు పెద్ద క్యాసినోలలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ దాడిలో ఈడీ దాదాపు రూ.12 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అందులో రూ.1 కోటి విదేశీ కరెన్సీ, రూ.6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండి, నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయి.
READ MORE: Konaseema : జలదిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు
వీటితో పాటు, 17 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను సీజ్ చేసింది. ఎమ్మెల్యే వీరేంద్ర కింగ్567, రాజా567 వంటి అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లను నడుపుతున్నాడని దర్యాప్తులో తేలింది. అతని సోదరుడు కె.సి. తిప్పస్వామి దుబాయ్ నుంచి డైమండ్ సాఫ్టెక్, టిఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ 9 టెక్నాలజీస్ అనే మూడు కంపెనీల ద్వారా ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. మరో సోదరుడు కె.సి. నాగరాజ్, అతని కుమారుడు పృథ్వీ ఎన్. రాజ్ కూడా ఈ పనిలో పాలుపంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల సమయంలో ఈడీ అనేక ముఖ్యమైన పత్రాలు, ఆధారాలను కూడా కనుగొంది. అక్రమ ఆదాయాన్ని వేర్వేరు విధానాల ద్వారా వైట్ మనీగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమైంది.
