Site icon NTV Telugu

CM Siddaramaiah: హిందూ మతంలో సమానత్వం ఉంటే.. మతం ఎందుకు మారుతున్నారు?

Cm Siddaramaiah

Cm Siddaramaiah

CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మత మార్పిడులపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వివాదం చెలరేగింది. హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరైనా ఎందుకు మతం మారుతారు? అని ఆయన అన్నారు. సమానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది? మనం అంటరానితనాన్ని సృష్టించామా? అని ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ మతంలోనైనా అసమానతలు ఉండవచ్చని.. తాము లేదా బీజేపీ ఎవరినీ మతం మారమని అడగలేదన్నారు. కానీ ప్రజలు మతం మారుతున్నారని.. అది వారి హక్కు అన్నారు.

READ MORE: Kolors Healthcare : విశాఖపట్నంలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’.. ప్రారంభించిన హీరోయిన్ సంయుక్త మీనన్

ముఖ్యమంత్రి హిందూ మతాని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. శాసనసభలో బీజేపీ ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక సీఎం వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. సమానత్వం అంశంపై మీరు ఎల్లప్పుడూ హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. సమానత్వంపై ముస్లింలను ప్రశ్నించే ధైర్యం మీకు ఉందా? అని ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, మసీదులలో మహిళలపై ఆంక్షలు, ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడానికి వ్యతిరేకత నిరసనలపై ప్రశ్నించారు.

READ MORE: Andhra Pradesh : కుల సర్టిఫికేట్‌పై టీడీపీ vs వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దుమారం

“అవును, కుల వ్యవస్థ హిందూ సమాజంలో ఒక శాపం. కానీ చాలా మంది గొప్ప సంస్కర్తలు కాలక్రమేణా హిందూ సమాజాన్ని సరిదిద్దడానికి, మార్పు తీసుకురావడానికి జన్మించారు. హిందూ సమాజానికి తనను తాను సరిదిద్దుకునే శక్తి ఉంది. బసవన్న నుంచి స్వామి వివేకానంద వరకు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నుంచి నేటి వరకు.. లెక్కలేనంత మంది సంస్కర్తలు హిందూ సమాజాన్ని మెరుగుపరచడానికి పనిచేశారు. ఇప్పటికీ చాలా మంది ఆ పని చేస్తూనే ఉన్నారు. కానీ ఇస్లాంలో లోతుగా పాతుకుపోయిన మౌలికవాదం, జిహాదీ మనస్తత్వాన్ని ఎవ్వరూ ఎప్పుడూ ప్రశ్నించలేదు. సరిదిద్దడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. సంస్కర్తలు ఉద్భవించినప్పటికీ, ముస్లింలు అలాంటి మార్పును ఎప్పుడూ అంగీకరించలేదు.” అని ప్రతిపక్ష నాయకుడు అశోక అన్నారు.

Exit mobile version