NTV Telugu Site icon

Karnataka CM: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య

Karnataka Cm

Karnataka Cm

కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు కీలకమైనవి. అందులో ఒకటే.. అన్నభాగ్య పథకం.. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రతినెలా 10 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకం.. ప్రస్తుతం ఈ స్కీమ్ ఆరంభమైంది. ఇవాళ ( సోమవారం) సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఈ పథకాన్ని లాంఛనంగా స్టార్ట్ చేశారు. ఈ పథకంలో సిద్ధరామయ్య సర్కార్ చిన్న మార్పు చేసింది. 10 కేజీల ఉచిత బియ్యాన్ని అయిదు కేజీలకు కుదించింది. అయిదు కేజీల ఉచిత బియ్యాన్ని అందించడంతో పాటు మరో అయిదు కేజీల బియ్యానికి సమానమైన మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ పర్ చేయనున్నట్లు మార్పులు చేసింది.

Read Also: Video Viral: ఏ ఆటోనో, బస్సో కాదు.. ఏకంగా రైలునే నెడుతున్నారు.. వీడియో వైరల్..!

ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ పంపిణీ చేసే బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను విధించింది. ఇటీవలే ఇది అమల్లోకి వచ్చింది. ఫలితంగా అన్నభాగ్య పథకాన్ని అమలు చేయడానికి చాలినంత బియ్యాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం సేకరించలేకపోయింది. అందు కోసమే అయిదు కేజీల బియ్యంతో పాటు మిగిలిన అయిదు కేజీలకు సంబంధించిన మొత్తాన్ని లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో వేసేలా అన్నభాగ్య స్కీమ్ లో మార్పులు చేసి.. దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీని మళ్లీ టీమిండియాకు కెప్టెన్‌గా చేయొచ్చుగా..

అయిదు కేజీల బియ్యానికి సమానమైన మొత్తం రూ.170.. ఈ మొత్తం.. వచ్చే 15 రోజుల్లోగా లబ్దిదారుల అకౌంట్లకు బదిలీ చేయనున్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 4.42 కోట్ల మందికి ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. గతంలో ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం.. దేశంలో ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసింది.. దీన్ని మోడీ సర్కార్ నీరుగారుస్తోందని కన్నడ సీఎం సిద్ధరామయ్య విమర్శించారు. ఈ చట్టం కింద దేశ ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.