NTV Telugu Site icon

Siddaramaiah: ఓ రేంజ్ లో డ్యాన్స్ ఇరగదీసిన ముఖ్య మంత్రి.. కావాలంటే మీరు ఓ లుక్కేయండి

New Project 2023 11 04t085440.783

New Project 2023 11 04t085440.783

Siddaramaiah: కర్ణాటకలోని హంపిలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. అక్కడకు వచ్చిన తన అభిమానులను తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ అలరించారు. గతంలో చాలాసార్లు డ్యాన్స్‌ చేశాడు. ఇటీవల జరిగిన కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమంలో సిద్ధరామయ్య సంప్రదాయ పాటకు కాలు కదిపిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపిలో ‘కర్ణాటక సంభ్రమన్-50’ పేరుతో కన్నడ సాంస్కృతిక శాఖ ఏడాది పొడవునా కన్నడ రాజ్యోత్సవాలను నిర్వహిస్తోంది.

Read Also:Health Tips : అంజీరాలను ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో.. అస్సలు నమ్మలేరు..

ఈ సందర్భంగా గురువారం కరుణదయ జ్యోతి రథయాత్రను సీఎం ప్రారంభించారు. ఆ సమయంలో సిద్ధరామయ్య స్వగ్రామం సిద్ధరామహుండికి చెందిన పలువురు కళాకారులు వీర మక్కల కుణిత జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. కళాకారుల కోరిక మేరకు సిద్ధరామయ్య కూడా వారితో కలిసి నృత్యం చేశారు. సిద్ధరామయ్య కళాకారులతో స్టెప్పులు వేసి అలరించారు. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు, కార్యకర్తలు, నాయకులు సిద్ధరామయ్య నృత్యం చేస్తుండగా చప్పట్లు,ఈలలతో ఉత్సాహ పరిచారు.

Read Also:Diwali Special Trains: దీపావళి రద్దీ.. రైల్వే ప్రత్యేక రైళ్లు