Site icon NTV Telugu

Karnataka CM Change: హస్తీనకు కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ..

Dk Shivakumar , Siddaramaia

Dk Shivakumar , Siddaramaia

Karnataka CM Change: కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్‌కు తెరలేచాయి. తాజాగా కర్ణాటక అధికార పార్టీ పంచాయితీ ఢిల్లీ హైకమాండ్‌కు చేరింది. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి నేటికి రెండున్నరేళ్లు పూర్తి. ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం.. సీఎం సిద్ధరామయ్యను మార్చాలంటూ ఈ రోజు రాత్రి డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్తున్నారు. రాష్ట్రంలో డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు ఇవ్వాలని ఆయన వర్గం ఎమ్మెల్యే కొరనున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో సీఎం మార్పు ఊహాగానాలే అంటూ సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేశారు.

READ ALSO: Ravi Babu : ఆ పోస్టర్ చూసి నన్ను తిట్టారు.. రవిబాబు కామెంట్స్

కర్ణాటకలో అసలు ఏం జరుగుతుంది..
కర్ణాటకలో పవర్ షేరింగ్‌పై ఇప్పుడు పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో ఎవరిని సీఎం చేయాలనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరిపింది. ఆ సమయంలో పీసీసీ చీఫ్‌గా ఉన్న డీకే శివకుమార్, గతంలో సీఎంగా పని చేసిన సిద్ధరామయ్య పేర్లు తెరపైకి వచ్చాయి. వాళ్లిద్దరిలో కూడా సీనియర్‌గా ఉన్న సిద్ధరామయ్య వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపి సీఎంగా పగ్గాలు అప్పగించింది. అయితే ఆ సమయంలో పలు కీలక శాఖలతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఆ సమయంలో ఈ ఇద్దరు నాయకుల మధ్య రాజీ జరిగిందనే చర్చ బయటికి వచ్చింది. వీరిద్దరి మధ్య 2.5 ఫార్మిలా సయోధ్య జరిగిందనే చర్చ కూడా జోరుగా ప్రచారం జరిగింది. మొదటి 2.5 ఏళ్లు రాష్ట్రంలో సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని, తర్వాత కాలం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పని చేస్తారని ఒక రాజీ జరిగిందనే ప్రచారం బయటికి వచ్చింది.

అందులో భాగంగా మొదటగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని డీకే వర్గం చెబుతుంది. కానీ ఇప్పుడు అనుకున్న సమయం ముగిసిన కూడా సీఎం కుర్చీ శివకుమార్‌కు ఎందుకు ఇవ్వడం లేదనే దానిపై ఆయన వర్గం వాళ్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. గత వారమే సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ హైకమాండ్ పెద్దలతో విడివిడిగా సమావేశం అయ్యారు. పార్టీ పెద్దలకు రాష్ట్రంలోని పరిస్థితులు, ముఖ్యమంత్రి మార్పు అంశంపై వాళ్లిద్దరూ చర్చించినట్లు సమాచారం. అయితే ఆ సమయంలోనే హైకమాండ్ సీఎం మార్పుపై ఏ విషయం అయినా తామే నిర్ణయం తీసుకుంటామని, ఎవరు కూడా ఎటువంటి ఊహాగాలకు పోవద్దని, దీనిపై ఎక్కడ కూడా మాట్లాడవద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఢిల్లీ పర్యటన తర్వాత ఇద్దరు నాయకులు కూడా సైలెంట్‌గా ఉన్నప్పటికి ఇప్పుడు డీకే శివకుమార్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు హస్తినకు బాట పడుతున్నారు. ఈ రాత్రి వాళ్లు బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి డీకే శివకుమార్‌ను సీఎంను చేయాలనే ఒక డిమాండ్‌ను చేసే ఛాన్స్ ఉందని సమాచారం. డీకే వర్గం ఎమ్మెల్యేలు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలుస్తారా, లేదంటే రాహుల్ గాంధీని కలుస్తారా అనేది మాత్రం ఇంకా అధికారికంగా బయటికి రాలేదు.

READ ALSO: Aadhaar Update: ఆధార్ కార్డు నుంచి ఈ రెండు అదృశ్యం కానున్నాయి..

Exit mobile version