Karnataka: పెట్రో ధరల పెంపుపై నిరసన.. గుండెపోటుతో బీజేపీ నేత మృతి
- పెట్రో ధరల పెంపుపై కర్ణాటకలో బీజేపీ నిరసన
- గుండెపోటుతో బీజేపీ నేత భానుప్రకాష్ మృతి
- పెంపును సమర్థించుకున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం అమ్మకం పన్ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.3, డీజిల్ రూ.3.05 చొప్పున పెరిగింది. పెంచిన ధరలపై బీజేపీ సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్న కర్ణాటక బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎం.బి.భానుప్రకాష్ గుండెపోటుతో మరణించారు. శివమొగ్గలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కారులో ఆయనను ఎక్కిస్తుండగా కుప్పకూలిపోయారు. సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. 69 ఏళ్ల భానుప్రకాష్ గతంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడుగా సేవలందించారు.
ఇది కూడా చదవండి: Mahanandi: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం
Also Read
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
కాగా పెట్రోల్, డీజిల్ ధరలపై సేల్స్ టాక్స్ పెంపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్ధించుకున్నారు. మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు కర్ణాటకలో తక్కువేనని అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర నిధులు, జీఎస్టీ డివాల్యూయేషన్ వాటా, రాష్ట్ర ప్రాజెక్టులకు నిధుల విడుదల విషయంలో అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ‘సీతా కళ్యాణ వైభోగమే’ యూనిట్‌కి తెలంగాణ సీఎం అభినందనలు
తాజావార్తలు
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!