NTV Telugu Site icon

Karnataka: పెట్రో ధరల పెంపుపై నిరసన.. గుండెపోటుతో బీజేపీ నేత మృతి

Beke

Beke

శనివారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్‌పై 29.84 శాతం, డీజిల్‌పై 18.44 శాతం అమ్మకం పన్ను పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.3, డీజిల్ రూ.3.05 చొప్పున పెరిగింది. పెంచిన ధరలపై బీజేపీ సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగింది. అయితే ఈ నిరసనల్లో పాల్గొన్న కర్ణాటక బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎం.బి.భానుప్రకాష్ గుండెపోటుతో మరణించారు. శివమొగ్గలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే కారులో ఆయనను ఎక్కిస్తుండగా కుప్పకూలిపోయారు. సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. 69 ఏళ్ల భానుప్రకాష్ గతంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడుగా సేవలందించారు.

ఇది కూడా చదవండి: Mahanandi: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం

కాగా పెట్రోల్, డీజిల్ ధరలపై సేల్స్ టాక్స్ పెంపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమర్ధించుకున్నారు. మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు కర్ణాటకలో తక్కువేనని అన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర నిధులు, జీఎస్‌టీ డివాల్యూయేషన్‌ వాటా, రాష్ట్ర ప్రాజెక్టులకు నిధుల విడుదల విషయంలో అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ‘సీతా కళ్యాణ వైభోగమే’ యూనిట్‌కి తెలంగాణ సీఎం అభినందనలు