మానవత్వమే అభిమతంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా..మతసామరస్యానికి ప్రతీకగా, గంగా జమున తెహజీబ్ కు కేరాఫ్ కరీంనగర్ పట్టణం వేదికగా, హిందూ-ముస్లిం భాయి భాయి అనే నినాదంతో జమ్.. జమ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 2005 నుండి ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు..తెలంగాణ హజ్ కమిటీ సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తన స్వంత ఖర్చుతో హిందూ ముస్లిం సోదర భావాన్ని పెంపొందించేందుకు, మానవత్వపు పునాదిగా అద్భుతమైన సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు..బుధవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా, నగరంలోని రాజీవ్ చౌక్ లో అతిపెద్ద స్టాల్ ను మంత్రి కమలాకర్ ప్రారంభించారు.
Also Read : Prabhas: ప్రభాస్ విగ్రహంపై బాహుబలి నిర్మాత ఫైర్.. క్లారిటీ ఇచ్చిన మ్యూజియం అధికారులు
బాదం మిల్క్ స్టాల్ ను సిపి సుబ్బారాయుడు, లస్సీ, బటర్ మిల్క్ స్టాల్ ను మేయర్ సునీల్ రావులు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ ఉచిత పెద్ద స్టాల్ ను రాజీవ్ చౌక్ లో ఏర్పాటు చేసి సుమారు 30వేల ఉచిత మినరల్ వాటర్ బాటిల్స్, గులాబ్ వాటర్, లస్సీ.. బట్టర్ మిల్క్, బాదాం మిల్క్ ను పంపిణీ చేస్తూ..దేశంలోనే గులాం అహ్మద్ ఆదర్శంగాప్రాయుడన్నారు. దేశంలో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, కుల, మత, వర్గ, భేద వ్యవస్థను చూస్తే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే భిన్నంగా..మత సామరస్యానికి ప్రతీకగా, గంగా జమున తెహజీబ్ కు కేరాఫ్ గా కరీంనగర్లో మాత్రం హిందూ-ముస్లిం అనే భేదభావం లేకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించే పద్ధతిలో భాగంగా మినరల్ వాటర్ ను, శీతల పానీయాలను గణేష్ నిమజ్ఞానికి వెళ్లే నగర హిందూ సోదరుల కోసం ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. వినాయక నిమజ్జనం సందరరేగా త్రాగునీరు, శీతల పానీయాలు పంపిణీ చేయడం ఎంతో పుణ్యదాయకమని నిమజ్జనానికి వెళుతున్న భక్తులకు ఈ సౌకర్యాన్ని జమ్ జమ్ వెలేర్ సొసైటీ: ద్వారా స్టాల్ ఏర్పాటు చేసి సేవలందించడం మతసామరస్యానికి మారుపేరుగా నిలిచిందని కొనియాడారు.
Also Read : Agent OTT: అఖిల్ ఫాన్స్ కి బాడ్ న్యూస్.. ఏజెంట్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై “స్టే”