IPL 2026: తారలు దిగివచ్చిన వేళ.. ముంబై వర్సెస్ బెంగళూరు పోరులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ ఊపేస్తోంది. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై వర్సెస్ బెంగళూరు మ్యాచ్ కేవలం క్రికెట్ అభిమానులకే కాకుండా, సినీ ప్రియులకు కూడా కనువిందు చేసింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సినీ తారల రాకతో గ్లామర్ అద్దినట్లయింది. ఒకవైపు మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, మరోవైపు స్టాండ్స్‌లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.
READ ALSO: Kiran Abbavaram : మల్టీటాస్క్స్ చేస్తూ.. టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం.
Also Read
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
ముంబై జెర్సీలో కరీనా కపూర్ ఫ్యామిలీ
బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తన కుటుంబంతో కలిసి స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారులు తైమూర్, జెహ్‌లతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరయ్యారు. విశేషమేమిటంటే వీరందరూ ముంబై ఇండియన్స్ జెర్సీలు ధరించి తమ హోమ్ టీమ్‌కు గట్టిగా మద్దతు పలికారు. గ్యాలరీలో కరీనా, సైఫ్ తమ పిల్లలతో గడిపిన క్యూట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
— I am Kareena Kapoor Khan (@KareenaTweets_) April 12, 2026
ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ ధావన్ – పూజా హెగ్డే
యువ హీరో వరుణ్ ధావన్ కూడా స్టేడియంలో సందడి చేశారు. బుట్టబొమ్మ పూజా హెగ్డేతో కలిసి ఆయన మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న “హై జవానీ తో ఇష్క్ హోనా హై” చిత్రం త్వరలో విడుదల కానుంది. మొదట జూన్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు మే 22కి ప్రీపోన్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి స్టేడియంలో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Pooja Hegde & Varun Dhawan Applaud Virat Kohli’s Brilliant Fifty vs MI 🔥 pic.twitter.com/G0WWTgqcff
— Cricket Vaira (@ramgaming242) April 12, 2026
విరాట్ ఫిఫ్టీ.. అనుష్క ఫుల్ హ్యాపీ
మరోవైపు కింగ్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ తన భర్తకు మద్దతుగా స్టాండ్స్‌లో కూర్చుని కనిపించారు. ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించడంతో అనుష్క ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. విరాట్ ఆడే ప్రతి షాట్‌కు ఆమె చప్పట్లతో ఉత్సాహపరుస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ స్టార్ కపుల్‌కి సంబంధించిన రొమాంటిక్ అండ్ ఎనర్జిటిక్ మూమెంట్స్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అటు క్రికెట్ ధమాకాను, ఇటు బాలీవుడ్ గ్లామర్‌ను సమపాళ్లలో పంచినట్లు అయ్యింది.
Who is the girl between Ananya Birla and Virat Kohli 's wife Anushka Sharma? #MIvsRCB pic.twitter.com/sw4MtUDw5J
— Chota Don (@choga_don) April 12, 2026
READ ALSO: Hungary Election Results: హంగేరీలో ఓర్బన్ శకం ముగిసింది.. యువ నేత పీటర్ మాగ్యార్ సంచలన విజయం!
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!