NTV Telugu Site icon

Karan Johar: నన్ను హత్య చేసిన పర్లేదు.. ఆ హీరోలకు అంత సీన్ లేదు.. కరణ్ సంచలన వ్యాఖ్యలు

Karan

Karan

Karan Johar: ఇండస్ట్రీలో కాంట్రావర్సీ నిర్మాత ఎవరు అంటే టక్కున కరణ్ జోహార్ అని చెప్పుకొచ్చేస్తారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోవడానికి కరణ్ మాఫియా నే కారణమని చాలామందికి తెలుసు. బాలీవుడ్ లో ఏది జరిగినా అతడికి తెలియకుండా మాత్రం జరగదు. స్టార్ కిడ్స్ ను పరిచయం చేయాలన్నా, స్వంతంగా ఎదిగిన హీరో హీరోయిన్లను తొక్కేయాలన్నా కరణ్ తర్వాతే ఎవరైనా.. అలాంటి కరణ్ స్టార్ హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీ టౌన్ ను షేక్ చేస్తున్నాయి. కొంత మంది స్టార్ హీరోలు దేనికి పనిరారని, రెమ్యూనిరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేస్తారని చెప్పి షాక్ ఇచ్చాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ.. ” నిర్మాతగా నేను చాలా మంది స్టార్ హీరోలను నమ్మి మోసపోయాను. నా నష్టాలను చూసి తట్టుకొనే శక్తి నాకు ఉంది కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉన్నాను. కొన్ని రోజులుగా బాలీవుడ్ లో ఎలాంటి దుస్థితి ఉంది అనేది అందరికి తెల్సిందే. అందుకు కారణం.. బాలీవుడ్ హీరోలే.. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడం.. అందులో హీరోలుగా స్టార్ హీరోలను తీసుకోవడం అంతా బాగానే ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో ఐదు కోట్ల రూపాయల ఓపెనింగ్స్ కూడా రాబట్టలేని హీరోలు ఒక్కో సినిమాకి 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. వారికి అంత సీన్ లేదని వారికి తెలుసు.. ఈ విషయం తెలిసాకా నన్ను హత్య చేసినా ఆశ్చర్యం లేదు. కానీ, చెప్తున్నాను. బాలీవుడ్ సినిమాలతో పోలిస్తే టాలీవుడ్ సినిమాలు మాత్రమే మంచి బిజినెస్ రాబాడుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమా అని చెప్పుకోవడానికే.. అందులో సగం డబ్బు హీరో రెమ్యూనిరేషన్ కే పోతోంది. ఇక వారు హిట్టా..? ఫట్టా అనేది కూడా చూడరు. వారి సత్తా కూడా తెలుసుకోకుండా అంత డిమాండ్ చేయడం వారికి అనవసరం” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కరణ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి కరణ్ అన్న ఆ స్టార్ హీరోలు ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.