NTV Telugu Site icon

Kapildev: కపిల్ దేవ్ కిడ్నాప్.. అసలు కారణం ఇదే

Kapil

Kapil

Kapildev: స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్ అంటూ రెండు రోజులుగా ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారిన విషయం తెల్సిందే. ఇద్దరు వ్యక్తులు.. కపిల్ దేవ్ చేతులు, నోరు కట్టేసి.. ఆయనను లోపలి తీసుకెళ్తుండగా.. కపిల్ వెనక్కి తిరుగుతూ బయపడతు కనిపించాడు. ఇక ఈ వీడియోను మరో క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆ వీడియోను షేర్ చేస్తూ.. ఈ వీడియో మీ వరకు వచ్చిందా.. ? ఇందులో ఉన్నది కపిల్ దేవ్ కాకూడదు.. ఆయన బాగానే ఉన్నారని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో కపిల్ కు ఏమైందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కపిల్ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కథ బయటపడింది. ఆ వీడియోలో ఉన్నది కపిల్ దేవ్ అని కన్ఫర్మ్ అయ్యింది. ఇదంతా ఒక యాడ్ షూట్ కోసం జరిగిన షూట్. అక్టోబరు 5 నుంచి భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనున్న విషయం తెల్సిందే. దానికోసమే కపిల్ ఒక యాడ్ చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఐసీసీ వరల్డ్ కప్ లైవ్ వస్తుంది అని చెప్పడానికి ఈ యాడ్ ను షూట్ చేశారు.

Nithya Menen: స్టార్ హీరో నన్ను వేధించాడు.. ఆ ఇండస్ట్రీ వలన ఎన్నో ఇబ్బందులు పడ్డా

క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యిందంటే కరెంట్ కోతలు .. అంతరాయాలు వలన క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అలాంటి అడ్డంకులు ఏమి లేకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హ్యాపీ గా చూడొచ్చు అని ఈ యాడ్ ద్వారా.తెలిపారు అసలు ఈ వీడియోలో ఏముందంటే.. కొంతమంది గ్రామస్థులు కపిల్ దేవ్ ను కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. ఇక ఆ విషయం తెలియడంతో పోలీసులు ఒక ఇంటిని చుట్టూ ముడతారు. ఇక పోలీసులు ఒక మైక్ లో కపిల్ ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడగ్గా.. వరల్డ్ కప్ వేళ కరెంటు కోతలు లేకుండా మ్యాచ్ లు ప్రసారం చేస్తామని హామీ ఇస్తే కపిల్ ను వదిలిపెడతామని కిడ్నాపర్లు బదులిస్తారు. ఇక పోలీస్ .. అవన్నీ ఇకనుంచి ఉండవు డిస్నీ ప్లస్ లో ఫ్రీగా క్రికెట్ మ్యాచ్ చూడొచ్చు.. డేటా సేవర్ మోడ్ లో పెట్టుకొని క్రికెట్ మ్యాచ్ పూర్తిగా చూడొచ్చు అని చెప్పడంతో కపిల్ ను రిలీజ్ చేస్తారు. దీంతో యాడ్ పూర్తవుతుంది. ఇక దీంతో కపిల్ కిడ్నాప్ వెనుక ఉన్న అసలు కథ ఇది అని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Show comments