NTV Telugu Site icon

Kapil Dev: పిచ్ బాగుంటే కోహ్లీ కచ్చితంగా సెంచరీ చేస్తాడు: కపిల్ దేవ్

10

10

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (12) ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. అరంగేట్రం ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ వేసిన సాధారణ బంతికే అతడు పెవిలియన్ చేరడంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇదే విషయమై భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సమాధానమిచ్చాడు. అతడి సామర్థ్యంపై సందేహపడకూడదని కోహ్లీకి మద్దతిచ్చాడు. పిచ్ కొంచెం బాగున్నా కోహ్లీ సెంచరీ చేస్తాడని చెప్పాడు.

Also Read: Rohit Sharma- Rithika Sajdeh: రోహిత్ రికార్డు సెంచరీ.. భార్య రితిక పోస్ట్ ట్రెండింగ్

ఈ సిరీస్‌లో కోహ్లీ ప్రభావం చూపిస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతడికి ఇంకా పరుగులు దాహం తీరలేదు. తొలి మ్యాచ్ చాలా ముఖ్యమైంది. ఒకవేళ అతడు పరుగులు చేయడం ఆరంభిస్తే తనదైన శైలిలో చేస్తాడు. మొదటి టెస్టుకు అతడి లాంటి స్టార్ ఆటగాడు ఎప్పుడూ ముఖ్యమే. అతడు 50 పరుగులు చేసినా.. ఈ సిరీస్‌లో అతడు మరో 2,3 శతకాలు చేస్తాడని నేను ఊహించగలను. టర్నింగ్ పిచ్‌లు గురించి వింటున్నాం. జట్లు 600 స్కోరు చేస్తుందని చెప్పలేం కానీ, ఒకవేళ చేస్తే ఇరుజట్ల బ్యాటర్లకు అనుకూలించవచ్చు. పిచ్‌లు బ్యాటర్ల చేతిలోనే ఉంటాయి. ఈ రోజుల్లో 60 శాతం పిచ్‌లు బౌలర్ల పక్షాన నిలుస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని 400 పరుగులు చేస్తాం అని చెప్పలేకపోవచ్చు. కానీ 220 నుంచి 250 మధ్య చేయొచ్చు. 350 స్కోరంటే చాలా పెద్దది ఫీలింగ్ కలుగుతుంది. పిచ్‌లు బాగుంటే విరాట్ కోహ్లీ కచ్చితంగా పరుగులు చేస్తాడు” అని కపిల్ దేవ్ వెల్లడించాడు.

ఆసీస్‌ మరోసారి పేకమేడలా..

ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా మంచి ఆధిక్యం సంపాదించింది. ఆస్ట్రేలియాను మొదట 177 రన్స్‌కే ఆలౌట్ చేసిన భారత జట్టు.. అనంతరం బ్యాటింగ్‌కు దిగి 400 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) సెంచరీతో రెచ్చిపోగా.. అక్షర్ పటేల్ (84), రవీంద్ర జడేజా (70) హాఫ్ సెంచరీలతో అలరించారు. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 223 రన్స్ ఆధిక్యం సంపాదించింది. భారత స్పిన్నర్లు మరోసారి రెచ్చిపోతే భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్ చేసే అవకాశం లేకుండానే విజయం వరించే అవకాశం ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్.. 42 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఖవాజా (5), వార్నర్ (10)తో పాటు లబుషేన్ (17), రెన్‌షా (2) పూర్తిగా నిరాశపర్చారు. అశ్విన్ 3 వికెట్లు తీయగా జడేజాకు ఒక వికెట్ దక్కింది.

Also Read: Woman Falls Under Train: రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది.. కానీ ఇంతలోనే..