Site icon NTV Telugu

Kapil Dev: కామెంటరీ, ఎండార్స్‌మెంట్, రియల్ ఎస్టేట్.. కపిల్ దేవ్ వార్షిక ఆదాయం ఎంతో తెలుసా?

Kapil Dev

Kapil Dev

Kapil Dev Net Worth and Annual Income in 2025: మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ 1983 ప్రపంచకప్‌ను భారత జట్టుకు అందించిన విషయం తెలిసిందే. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. హేమాహేమీలు ఉన్న వెస్టిండీస్ జట్టును ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ గెలుచుకుంది. టీమిండియాకు మొదటి కప్ అందించిన కపిల్‌ దేవ్.. 1994లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అనంతరం కపిల్ దేవ్ పలు విధాలుగా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం కపిల్‌కు అనేక ఆదాయ వనరులు ఉన్నాయి. కపిల్‌ నికర విలువ, వార్షిక ఆదాయం ఎంతో ఓసారి చూద్దాం.

2025 నాటికి కపిల్ దేవ్ నికర విలువ దాదాపు 30 మిలియన్లు ఉంటుందని అంచనా. ఇది భారతీయ కరెన్సీలో దాదాపు రూ.250-260 కోట్లు. క్రికెట్ కెరీర్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, కామెంటరీ, పెట్టుబడులతో సహా రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా కపిల్ డబ్బు సంపాదిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం కపిల్ దేవ్ వార్షిక ఆదాయం దాదాపు 12 కోట్లు. కపిల్‌కు భార్య రోమి, కూతురు అమియా ఉన్నారు. ప్రస్తుతం కపిల్ తన కుటుంబంతో ఢిల్లీలో నివసిస్తున్నారు.

కామెంటరీ లేని సమయంలో కపిల్ దేవ్ ఎక్కువగా గోల్ఫ్ ఆడుతుంటారు. ఉదయం పూట ఢిల్లీ గోల్ఫ్ క్లబ్‌లో గోల్ఫ్ ఆడుతారు. కపిల్ వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. పోర్స్చే పనామెరా, మెర్సిడెస్ సి-220డి, మెర్సిడెస్ జిఎల్ఎస్ 350డి, టయోటా ఫార్చ్యూనర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కపిల్ దేవ్ భారత్ తరఫున 131 టెస్టులు ఆడి 5248 రన్స్, 434 వికెట్స్ పడగొట్టారు. 225 వన్డేల్లో 3783 పరుగులు, 253 వికెట్స్ తీశారు. రెండు ఫార్మాట్‌లలో కలిపి 9 సెంచరీలు చేశారు. టెస్టుల్లో 23, వన్డేల్లో ఒకసారి 5 వికెట్స్ పడగొట్టారు.

 

Exit mobile version