Kapil Dev: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, టీమిండియా మాజీ ఆటగాడు యోగ్‌రాజ్ సింగ్ మధ్య పాత వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. యోగ్‌రాజ్ సింగ్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలపై కపిల్ దేవ్ ఇచ్చిన స్పందన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్ సింగ్, కపిల్ దేవ్ తనను జట్టు నుండి అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై కపిల్ దేవ్ స్పందిస్తూ.. “కౌన్ హైన్?” అని సింపుల్‌గా ప్రశ్నించారు. యోగ్‌రాజ్‌ని గుర్తు చేయడానికి కొంత సమయం తీసుకున్న కపిల్ దేవ్, ఆ తరువాత “మరెవైనా ప్రశ్నలుంటే అడగండి” అని ప్రశాంతంగా చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెత్తిన వైరల్ గా మారింది.
Also Read: TCL 115inches TV: ఇంటిని సినిమా హాలులా మార్చే టీవీ వచ్చేసిందోచ్
యోగ్‌రాజ్ సింగ్, కపిల్ దేవ్ తనను జట్టు నుండి తొలగించడానికి కారణం తనను అతను ఇష్టపడకపోవడమే అని ఆరోపించారు. అంతేకాకుండా, కపిల్ దేవ్ ఇంటికి తుపాకీతో వెళ్లినట్లు కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపాయి. కపిల్ దేవ్ యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలపై ప్రశాంతంగా స్పందించడం ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఆయన యోగ్‌రాజ్‌ను గుర్తు చేయడానికి కొంత సమయం తీసుకోవడం, ఆయన ఆరోపణలను తీవ్రంగా తీసుకోలేదని ఇట్టే అర్థమవుతుంది.
కపిల్ దేవ్, యోగ్‌రాజ్ సింగ్ మధ్య జరిగిన ఈ వివాదం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ విషయంపై కొంతమంది కపిల్ దేవ్‌ను సమర్థిస్తుంటే, మరికొందరు యోగ్‌రాజ్ సింగ్‌ను సమర్థిస్తున్నారు. కొందరు ఈ వివాదాన్ని క్రికెట్ ప్రపంచంలోని పాత విభేదంగా భావిస్తున్నారు. మొత్తానికి కెపిల్ దేవ్, యోగ్‌రాజ్ సింగ్ మధ్య జరిగిన ఈ వివాదం క్రికెట్ ప్రపంచంలోని పాత విభేదాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. కపిల్ దేవ్.. యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలపై ప్రశాంతంగా స్పందించడం, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, ఈ వివాదం క్రికెట్ అభిమానుల మనసుల్లో మిశ్రమ భావాలను రేకెత్తిస్తోంది.