NTV Telugu Site icon

Kanyaka Movie: ఓటీటీల్లో ‘కన్యక’ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. నిర్మాతల ఆనందం!

Kanyaka Movie

Kanyaka Movie

మైథాలాజికల్ మూవీ ‘కన్యక’ సినిమా ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌, హంగామా, టాటా ప్లే బింజ్‌, వాచో, వి మూవీస్ టీవీ లాంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి వ్యూస్‌తో కన్యక మూవీ దూసుకుపోతోంది. దాంతో చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉందని నిర్మాత కూరపాటి పూర్ణచంద్ర రావు అన్నారు.

కన్యక చిత్రాన్ని బిసినీఈటి సమర్పణలో శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్స్‌పై కేవీ అమరలింగేశ్వరరావు, ఆతుకూరి సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్ర రావు నిర్మించారు. ఈ చిత్రానికి రాఘవేంద్ర తిరువాయిపాటి దర్శకత్వం వహించారు. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం విడుదల అయింది. విశ్వనాథ శాస్త్రి అనే ఒక బ్రాహ్మణోత్తముని కూతురు కన్యక కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయి లేచి పోయిందా లేదా ఎవరైనా చంపేశారా అని శ్రావ్య అనే అమ్మాయి ఆ ఊరికొచ్చి విశ్వనాథ శాస్త్రి గారి ఇంటిలో ఉంటూ ఇన్విస్టిగేట్ చేస్తుంది. కన్యకకు ఏమైంది, వచ్చిన అమ్మాయి ఎవరు?, చివరికి ఏం జరిగింది అని సస్పెన్స్ కథాంశంతో.. మనం చేసిన తప్పులను ఒక కన్ను గమనిస్తుందనే మెసేజ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

Also Read: Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తులంపై ఏకంగా 660 పెరిగింది! మరోసారి రికార్డు ధర

‘మా కన్యక సినిమాకు అన్ని ప్రముఖ ఓటీటీల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. మా మొదటి సినిమానే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. నకరికల్లు వాసవి కన్యక గుడిలో అమ్మవారి మీద చిత్రీకరించిన పాట హైలట్‌గా నిలుస్తోంది. కన్యక సకుటుంబంగా చూడదగిన మంచి సినిమా’ అని నిర్మాతలు అన్నారు. దర్శకుడు రాఘవ మాట్లాడుతూ… ‘ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే ఎవరు క్షమించినా అమ్మవారు క్షమించదని, శిక్షిస్తుందని ఈ చిత్రం ద్వారా తెలియజేశాం. చాలా తక్కువ రోజుల్లో తక్కువ బడ్జెట్‌లో ఫినిష్ చేశాం. షూటింగ్‌కు నకరికల్లు, చాగంటివారి పాలెం వాసులు ఎంతో సహకరించారు. కన్యక సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

 

Show comments