NTV Telugu Site icon

Harom hara : సుధీర్ బాబు హరోంహర నుంచి ‘కనులెందుకో’ లిరికల్ వీడియో రిలీజ్..

Whatsapp Image 2024 04 24 At 1.07.11 Pm

Whatsapp Image 2024 04 24 At 1.07.11 Pm

టాలీవుడ్‌ హీరో సుధీర్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గతంలో ఎప్పుడో వచ్చిన “ప్రేమ కథా చిత్రం”తో మంచి హిట్ అందుకున్న సుధీర్ బాబు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించాడు .కానీ ఏ సినిమా కూడా సుధీర్ బాబుకి సరైన హిట్ అందించలేదు..అయినా కూడా సుధీర్ బాబు వరుస సినిమాలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోం హర”… “ది రివోల్ట్” ట్యాగ్ లైన్ గా ఉంచారు.ఈ సినిమా సుధీర్ బాబు18 వ మూవీగా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా స్టోరీ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సెహరి ఫేం జ్ఞానసాగర్‌ ద్వారకా కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్ర మేకర్స్‌ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈ మూవీ కాన్సెప్ట్‌ టైటిల్‌ వీడియోతోపాటు పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

తాజాగా నిన్న ఈ మూవీ నుంచి కనులెందుకో అంటూ సాగే రెండో పాట ప్రోమోను లాంఛ్ చేశారు. నేడు ఈ పాట లిరికల్ వీడియో రిలీజ్ అయింది.వెంగి సుధాకర్ రాసిన ఈ పాటను చేతన్ భరద్వాజ్‌ కంపోజిషన్‌లో నిఖిత శ్రీవల్లి పాడింది.  ఈ మూవీ 1989 బ్యాక్‌ డ్రాప్‌లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ నాయుడు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్‌ మ్యూజిక్‌ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.హరోం హర మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీలో సుధీర్‌బాబు కుప్పం యాసలో మాట్లాడబోతున్నాడని సమాచారం.