Harom hara : సుధీర్ బాబు హరోంహర నుంచి ‘కనులెందుకో’ లిరికల్ వీడియో రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .గతంలో ఎప్పుడో వచ్చిన “ప్రేమ కథా చిత్రం”తో మంచి హిట్ అందుకున్న సుధీర్ బాబు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించాడు .కానీ ఏ సినిమా కూడా సుధీర్ బాబుకి సరైన హిట్ అందించలేదు..అయినా కూడా సుధీర్ బాబు వరుస సినిమాలు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోం హర”… “ది రివోల్ట్” ట్యాగ్ లైన్ గా ఉంచారు.ఈ సినిమా సుధీర్ బాబు18 వ మూవీగా తెరకెక్కుతుంది. పాన్ ఇండియా స్టోరీ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సెహరి ఫేం జ్ఞానసాగర్ ద్వారకా కథను అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్ర మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ టైటిల్ వీడియోతోపాటు పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
తాజాగా నిన్న ఈ మూవీ నుంచి కనులెందుకో అంటూ సాగే రెండో పాట ప్రోమోను లాంఛ్ చేశారు. నేడు ఈ పాట లిరికల్ వీడియో రిలీజ్ అయింది.వెంగి సుధాకర్ రాసిన ఈ పాటను చేతన్ భరద్వాజ్ కంపోజిషన్‌లో నిఖిత శ్రీవల్లి పాడింది. ఈ మూవీ 1989 బ్యాక్ డ్రాప్లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.హరోం హర మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీలో సుధీర్‌బాబు కుప్పం యాసలో మాట్లాడబోతున్నాడని సమాచారం.
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!