Site icon NTV Telugu

KantaraChapter1 Day 1Collections : అదరగొట్టిన కాంతార.. వరల్డ్ వైడ్ డే -1 కలెక్షన్స్ ఎంతంటే?

Kantara

Kantara

కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. కాంతార బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతార చాప్టర్ 1భారీ అంచనాల ఏర్పడ్డాయి. ఎట్టకేలకు దసరా కానుకగా నిన్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఆయింది.

Also Read : Tollywood Actress : ఆ ఇద్దరి భామల ముద్దుల కోరికను ఆ హీరో నెరవేరుస్తాడా?

ప్రీమియర్స్ తోనే కాంతార చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకు తగ్గట్టే తొలి రోజు ఈ సినిమా అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా సెంటర్స్ లో ఫస్ట్ షో, సెకండ్ షోస్ కు అదనంగా థియేటర్స్ యాడ్ చేసారంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ( ఎస్టిమేట్ )చూస్తే..

కర్ణాటక – రూ 20CR
హిందీ – రూ. 22CR
తెలుగు రాష్ట్రాలు – రూ. 10CR
మలయాళం –రూ. 5CR
తమిళ్ – రూ. 4CR
ఇండియా నెట్ –రూ. 61CR

ఇండియా గ్రాస్ – రూ. 72CR
ప్రీమియర్స్ – రూ. 6CR
ఓవర్సీస్ – రూ. 12CR ($1.35M)
వరల్డ్ వైడ్ గ్రాస్ – రూ. 90CR

Note : పైన పేర్కొన్న కలెక్షన్స్ ఎస్టిమేట్ కలెక్షన్స్.. వాటిని వివిధ సోర్స్ ద్వారా సేకరించబడినవి. నిర్మాణ సంస్థ ప్రకటించినవి కాదు.

Exit mobile version