Site icon NTV Telugu

Kantara Chapter1 : సినిమా బడ్జెట్ మొత్తం ఓటీటీ డీల్ తో రికవరీ చేసిన కాంతార

Kantara 1

Kantara 1

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్‌ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో కాంతారా చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేసిన రిషబ్ శెట్టి.. ఎన్ని సమస్యలొచ్చినా అధిగమించి.. చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజౌతుంది కాంతార ప్రీక్వెల్.

Also Read : Today Winner : మిరాయ్ vs కిష్కింధపురి.. విన్నర్ ఎవరంటే.?

కాంతార వన్‌ను 30 దేశాల్లో ఏడు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది హోంబలే ఫిల్మ్స్. ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో కూడా రిలీజవుతోంది. ఇప్పటికే ఆయా భాషల్లో సినిమాను డిస్ట్రిబ్యూటర్ ఎవరు చేస్తున్నారో డీటైల్స్ పంచుకుంది టీం. అయితే కేరళలో ఈసినిమాకు చిక్కులొచ్చి పడ్డాయి. మాలీవుడ్‌లో పృధ్వీరాజ్ సుకుమార్ నిర్మాణ సంస్థ రిలీజ్‌కు ప్లాన్ చేసుకోగా.. డిస్ట్రిబ్యూషన్ సంస్థకు, ఎగ్జిబిట్యూర్లకు మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో ఇష్యూ నడుస్తోందని సమాచారం. ఇప్పటి వరకు సమస్య సాల్వ్ కాలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పంజాబ్ సింగర్ దిల్జిత్ దోసంజ్‌తో సాంగ్ చేయించబోతుందని టాక్. కల్కిలో కూడా ఈ స్టార్ సింగర్‌తో ఓ ప్రమోషనల్ సాంగ్ చేయించారు నాగ్ అశ్విన్. ఇప్పుడు కాంతార ప్రీక్వెల్‌కు కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు 125 కోట్ల భారీ రేట్ పెట్టి కొనుగోలు చేసిందట. ఈ లెక్కన చూస్తే ఈ సినిమా బడ్జెట్ రికవరీ అయిపోయిందని తెలుస్తోంది. కాంతార తెరకెక్కించే సమయంలో ఈ సినిమాను తీసుకునేందుకు వెనకాడిన ఓటీటీ సంస్థలు.. ఇప్పుడు భారీ రేటు పెట్టి కొనుగోలు చేయడం చూస్తే.. ఇదే కదా నిజమైన విజయం అనిపించకమానదు. మరి రిషబ్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి

Exit mobile version