కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్ గ వస్తున్న కాంతారా చాప్టర్ వన్ ను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా టేకప్ చేసిన రిషబ్ శెట్టి ఎన్ని సమస్యలొచ్చినా అధిగమించి.. చెప్పిన టైంకి మూవీని దించేస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ఆంధ్రలో టికెట్ రేట్లు పెంచుతు అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై పలు విమర్శలు వస్తున్నాయి.
Also Read : Keerthi Suresh : యంగ్ హీరోతో లిప్ కిస్ కు కీర్తి సురేష్ సై?
మన తెలుగు సినిమాలను కన్నడలో ఇటీవల తెలుగు సినిమాలను అక్కడి కొన్ని సంఘాలు అడ్డుకుని అభ్యంతరం వ్యక్తం చేసాయి. అలాగే కాంతార నటుడు రిషబ్ శెట్టి ఇటీవల జరిగిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక్కమాట కూడా తెలుగులో మాట్లాడలేదు. అలాంటిది కాంతార 1కు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు ఎలా అనుమతులు ఇస్తారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అయ్యితే ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు కీలక ఆదేశాలు జారీ చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడూతూ ‘సినిమా అనేది భిన్న కళల సమాహారం. అందుకే డబ్బింగ్ సినిమా సినిమా అనే పేరుతో ఇతర సినిమాలను మనం వేరుగా చూడాల్సిన అవసరం లేదు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కాలం నుంచి ఇప్పుడు కిచ్చా సుదీప్, ఉపేంద్ర, శివరాజ్కుమార్, రిషబ్ శెట్టి వరకూ ప్రతి నటుడుని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మనం వారితో సోదరభా వంతో మెలుగుతున్నాం. తెలుగు సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మనం మాట్లాడదాం’ అని ఆదేశించారు.
