Site icon NTV Telugu

kaantha OTT : దుల్కర్–రానా నటించిన ‘కాంత’ ఓటీటీ రిలీజ్‌పై తాజా అప్డేట్

Kantha Ott

Kantha Ott

పీరియాడిక్ డ్రామా జానర్‌లో తెరకెక్కిన ‘కాంత’ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బొర్సే, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. అంతే కాదు ఈ సినిమా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మించారు. ఇక సెల్వమణి సెల్వరాజ్ వహించిన ఈ మూవీ మొదటి రోజు నుండి మంచి రెస్పాన్స్ వచ్చినా, తరువాత మౌత్‌టాక్ బలంగా లేకపోవడంతో కలెక్షన్లు వేగంగా పడిపోయాయి. దీంతో..

Also Read : Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం బోల్డ్ స్టేట్‌మెంట్

సినిమా పెద్దగా రాణించలేకపోయింది. ఇక థియేటర్లలో సాధించిన ఫలితం అంతగా బాగా లేకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ రిలీజ్ మీదే ఉంది. కాంత సినిమా ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. కాగా తాజా టాక్ ప్రకారం, కాంత సినిమాను డిసెంబర్ 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. థియేటర్లలో పెద్ద సక్సెస్‌ అందుకోలేకపోయిన కాంత, ఓటీటీ లో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version