Ravichandran Ashwin’s WTC Record: చెపాక్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్.. కాన్పూర్ టెస్టులోనూ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చి రెండు వికెట్స్ పడగొట్టాడు. దీంతో వరుసగా మూడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిళ్లలో 50 ప్లస్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా యాష్ నిలిచాడు. డబ్ల్యూటీసీ 2023-25లో ఇప్పటివరకు 50 వికెట్లు తీసిన అశ్విన్.. డబ్ల్యూటీసీ 2019-21 సీజన్‌లో 71 వికెట్లు, 2021-23 సీజన్‌లో 61 వికెట్లు పడగొట్టాడు.
టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆర్ అశ్విన్ ముంగిట మరికొన్ని రికార్డులు ఉన్నాయి. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు యాష్ 182 వికెట్స్ తీశాడు. మరో ఆరు తీస్తే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ (187)ను అధిగమిస్తాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ 175 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.మరో రెండు వికెట్లు తీస్తే.. 2023-25లో అగ్రస్థానంలో ఉన్న జోష్ హేజిల్‌వుడ్ (51) దాటేస్తాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీసుల్లో అశ్విన్ 31 వికెట్లు తీశాడు. టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ కూడా 31 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ తీస్తే.. యాష్ అగ్రస్థానంలోకి వస్తాడు.
Also Read: Kanpur Test: టెస్టుల్లో టీమిండియా నయా రికార్టు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో ఇదే మొదటిసారి!
మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ దూకుడుగా ఆడుతోంది. కేవలం 10.1 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్‌ను అందుకుంది. దీంతో టెస్టుల్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ తన రికార్డును అధిగమించింది. ఇంతకుముందు 2023లో విండీస్‌పై 12.2 ఓవర్లలోనే సెంచరీ కొట్టేసింది. భారత్ 18 బంతుల్లోనే 50 ప్లస్ పరుగులు చేయడం విశేషం. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ దూకుడుగా ఆడడంతో టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదైంది.