KL Rahul about Kanpur Test: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డగౌట్‌లోని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి తమకు స్పష్టమైన సందేశం వచ్చిందని స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చెప్పాడు. ఔటైనా ఫర్వాలేదు కానీ.. వేగంగా ఆడి ఎక్కువ పరుగులు చేయాలని సూచించాడని తెలిపాడు. కెప్టెన్ ఆదేశాలకు తగ్గట్టుగానే ఆడినట్లు రాహుల్ వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దాంతో బంగ్లాదేశ్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగించింది. అయిదో రోజు ప్రారంభానికి ముందు రాహుల్ మాట్లాడాడు.
Also Read: The Goat OTT: విజయ్ అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ‘ది గోట్’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ‘ముందునుంచి మా లక్ష్యంపై స్పష్టమైన అవగాహన ఉంది. రెండు రోజుల ఆట వర్షం వల్ల రద్దైంది. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయలేం. మన చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించకూడదు. మిగిలిన సమయంలో ఏం చేయగలమనే దానిపై మేం దృష్టిపెట్టాం. బంగ్లాదేశ్‌పై విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగాం. మేం బ్యాటింగ్ చేస్తుండగా.. డగౌట్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి మాకు స్పష్టమైన సందేశం వచ్చింది. ఔటైనా ఫర్వాలేదు.. వేగంగా ఆడమని సూచించాడు. మేం అలానే చేశాం. ఆ తర్వాత మా బౌలర్లూ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు’ అని చెప్పాడు.