మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ “కన్నప్ప”.. ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నాడు… మంచు విష్ణు కెరీర్లోనే ఈ సినిమా సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. అయితే ప్రస్తుతం మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు. అందుకే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ని తీసుకుంటున్నారు.కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్,అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తున్నాడని న్యూస్ తెగ వైరల్ అయింది. దీనితో సినిమాపై ఊహించని క్రేజ్ మొదలైంది. అయితే తాజాగా ’కన్నప్ప’ టీం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను ఆన్ బోర్డ్ చేసుకుంది.
తాజాగా ఈ విషయాన్నీ మంచు విష్ణు ఓ వీడియో ద్వారా తెలియజేసారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ గారి రాకతో కన్నప్ప జర్నీ థ్రిల్లింగ్ మారింది.. మరపురాని అడ్వెంచర్ కోసం సిద్ధం గా ఉండండి అంటూ విష్ణు రాసుకొచ్చారు.. అయితే తాజాగా ఈ సినిమాలో శివుడి పాత్ర విషయంపై ఓ న్యూస్ వైరల్ అవుతుంది. శివుడి పాత్రకు గాను బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని తీసుకున్నట్లు సమాచారం.అయితే ముందు నుండీ ఆ పాత్ర ప్రభాస్ చేస్తున్నట్లు బాగా ప్రచారం జరిగింది. ప్రభాస్ ఆ పాత్రకు నో చెప్పటంతో ఇప్పుడు శివుడి పాత్ర అక్షయ్ కుమార్ చేస్తున్నట్లు సమాచారం.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.. ఈ సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు..