NTV Telugu Site icon

Naga Bhushana: ఫుట్ పాత్ పై వెళ్తున్న వారికి యాక్సిడెంట్ చేసిన నటుడు… ఒకరు భార్య మృతి

Accident

Accident

ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను కన్నడ నటుడు కారుతో ఢీకొట్టాడు. దీని కారణంగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా భార్య చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కన్నడలో కొన్ని చిత్రాల్లో నటించిన నాగభూషణ శనివారం రాత్రి తన కారులో ఉత్తరహళ్లి నుంచి కోననకుంట వైపు డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాడు. కారు వేగంగా నడుపుతున్నాడు నాగభూషణ.  రాత్రి 9.45 గంటల సమయంలో వసంత పుర ప్రధాన రహదారి వద్దకు వచ్చిన నాగభూషణ అక్కడ ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ జంటను ఢీ కొట్టాడు. ఆ యాక్సిడెంట్ లో 58 ఏళ్ల కృష్ణ, 48 ఏళ్ల ప్రేమ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: CBDT Chairman: సీబీడీటీ చైర్మన్‌ నితిన్ గుప్తా పదవీకాలం పొడగింపు.. వచ్చే ఏడాది జూన్ వరకు

తరువాత కారు అక్కడే ఉన్న ఓ పోల్ ను ఢీకొట్టింది. అనంతరం నాగభూషణ నే స్వయంగా వారిని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అయితే మార్గ మధ్యలోనే ఆయన భార్య చనిపోయింది. తీవ్ర గాయాలైన కృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన రెండు కాళ్లు, తల, కడుపుకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై బెంగళూరులోని కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఇక  నాగభూషణం ఇక్కత్ (2021), బాదవ రాస్కెల్ (2021), హనీమూన్ (2022) వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల విడులైన ‘తగరు పల్లయ’ చిత్రంలో కూడా ఆయన కనిపించారు. నటుడు అతివేగంతో ఇలా డ్రైవ్ చేసి ప్రాణం పోవడానికి కారణం కావడంతో అతడిపై జనాలు మండిపడుతున్నారు. అయితే ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడా లేదా అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.