NTV Telugu Site icon

Kanguva : వన్ అండ్ ఓన్లీ కంగువా.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందో తెలుసా ?

Kanguva

Kanguva

Kanguva : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. టీజర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

Read Also:Game Changer Teaser: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గేమ్ ఛేంజర్‌’ టీజర్ డేట్ ఫిక్స్!

ఈ భారీ సినిమా సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా వచ్చింది. ఈ సినిమా పై అయితే ఈ సినిమా ప్రమోషన్లలో అగ్రిసివ్ గా మేకర్స్ అంతా పాల్గొంటున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ సహా సినిమాపై మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వస్తున్నాయి. అయితే సినిమా అనౌన్స్ చేసిన సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ లెవెల్లో సినిమా విడుదల ఉంటుంది అని మేకర్స్ తెలిపారు. అలా ఇపుడు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డ్ స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. మరి లేటెస్ట్ సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో ఈ సినిమా రాబోతున్నట్టు టాక్. ఇక ఈ వినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా.. రూ.1000కోట్ల కలెక్షన్లు సాధించడమే లక్ష్యంగా ఈ సినిమాను తెరకెక్కించారని టాక్.

Read Also:Nithin : నితిన్ కు ఊపిరి పోసిన సినిమా మళ్ళి వస్తోంది..

Show comments