NTV Telugu Site icon

Kangana Ranaut: అమీర్ ఖాన్‌పై విరుచుకుపడిన కంగనా.. !

Kangana Ranaut

Kangana Ranaut

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఆమె పఠాన్ గురించి సానుకూలంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇటీవల రచయిత్రి శోభా డీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. తనపై బయోపిక్ తీస్తే తన పాత్రకు ఎవరు సరిపోతారని అమీర్ ఖాన్‌ను శోభా ప్రశ్నించారు. అలియా భట్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణెతో సహా కొంతమంది నటీమణుల పేర్లను అమీర్ తీసుకున్నాడు. అయితే అమీర్ కంగనా గురించి ప్రస్తావించలేదు. వెంటనే, శోభా డీ.. ‘వాళ్లు ముగ్గురూ ఎంతో ప్రతిభ కలిగిన నటీమణులు. కానీ, మీరు ఒకరిని మరిచిపోయారు.. కంగనా’ అని అన్నారు.

వెంటనే అందుకున్న అమీర్‌ ఖాన్.. అవును కంగనా కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఆమె స్ట్రాంగ్ యాక్టర్‌ అని అన్నారు. అనంతరం ఆమె నటించిన పలు సినిమాల గురించి మాట్లాడి.. సూపర్బ్ యాక్టర్ అని అన్నారు. ఈ వీడియోను కంగనా రనౌత్ అభిమాని ఒకరు ట్వీట్ చేశారు. ‘కంగనా వైవిధ్యమైన నటనను అమీర్ ఖాన్ పొగిడారు’ అని ఆ ట్వీట్‌లో రాసి ఉంది. కానీ, కంగనా రనౌత్‌కు మాత్రం ఆమిర్ ఖాన్ ముందు తన పేరును మరిచిపోవడాన్ని హైలైట్ చేశారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ ఆయన విరుచుకుపడినట్లు తెలుస్తోంది.

VBVK: వినరో భాగ్యము విష్ణు కథ సెన్సార్ పూర్తి.. శివరాత్రికి ఆ కథేంటో వినండి..

‘పాపం అమీర్ ఖాన్.. నటిగా మూడు జాతీయ పురస్కారాలు అందుకున్న నా పేరు చెప్పకుండా ఉండటానికి తన శక్తి మేర బాగా కష్టపడ్డారు. ఆయన చెప్పిన ఏ నటీ ఇప్పటి వరకు ఒక్క జాతీయ పురస్కారాన్ని కూడా అందుకోలేదు. థాంక్యూ శోభా గారు. మీ పాత్ర పోషించడాన్ని నేనెంతో ఇష్టపడతాను’ అని కంగనా రనౌత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.మూడుసార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న నటి తానేనని అమీర్ తనకు తెలియనట్లు నటించాడని, అమీర్ పేర్కొన్న మిగతా వారిలో ఒక్కరు కూడా లేరని కంగనా చెప్పింది. ఫ్యాషన్‌లో ప్రియాంక చోప్రా జాతీయ అవార్డును గెలుచుకుందని కొందరు కంగనాను విమర్శించారు. వాస్తవానికి, రచయిత శోభ ఇతరుల పేర్లను తీసుకున్నప్పుడు కంగనా గురించి అమీర్‌కు గుర్తు చేశారు. అప్పుడు కంగనా దానిని తీయగలదని, ఆమె బహుముఖ నటి అని అమీర్‌ ఖాన్‌ పేర్కొన్నారు.