NTV Telugu Site icon

Chirag paswan: కంగనా రనౌత్‌కు చిరాగ్ సపోర్ట్.. దాడిపై ఖండన

Paswan

Paswan

బాలీవుడ్ నటి, మండీ లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్‌కు రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్.. కంగనాను చెంప దెబ్బ కొట్టింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆమెపై దాడిని పలువురు ఖండించారు. తాజాగా లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్.. కంగనాకు మద్దతుగా నిలిచారు. ఆమెపై దాడిని ఖండించారు. ఎవరినైనా కొట్టే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. ఎన్డీఏ సమావేశంలో కంగనాతో చిరాగ్ ప్రత్యేకంగా కలిసి మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే మహిళా కానిస్టేబుల్‌ను ఇప్పటికే సస్పెండ్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇది కూడా చదవండి: Relationship Advice: మీ జీవితమంతా ఒంటరిగా ఉండండి కానీ.. ఇలాంటి వ్యక్తులతో డేటింగ్ చేయొద్దు!

కంగనాపై దాడి సరైంది కాదన్నారు. తాను ఎప్పుడూ భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతు ఇస్తానని చిరాగ్ చెప్పారు. తాను రెండు వైపులా మాట్లాడతానన్నారు. కంగనా తన అభిప్రాయాన్ని చెప్పిందని.. అలాగే కానిస్టేబుల్ మరో రకంగా స్పందించి ఉండొచ్చన్నారు. కానీ పౌరసమాజంలో భౌతిక దాడులు, హింసకు అస్సలు చోటు ఉండకూడదని చిరాగ్ పాశ్వాన్ ఓ మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు. ఒకవేళ కానిస్టేబుల్‌కు అభ్యంతరం ఉంటే కంగనా ముందే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండొచ్చు కదా? అన్నారు. అప్పుడు ఇంకా బాగుండేదన్నారు. ఎవరైనా సరే భౌతిక దాడికి దిగే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి: Chandrababu: రామోజీరావు పార్థివదేహానికి చంద్రబాబు దంపతుల నివాళి

చిరాగ్ పాశ్వాన్.. బీహార్‌లోని హాజీపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన NDA సమావేశంలో కంగనా రనౌత్‌తో సమావేశమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వీరిద్దరు రాజకీయాల్లోకి రాకముందు కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ 2011లో ‘మిలే నా మిలే హమ్’ అనే రొమాంటిక్ కామెడీ చిత్రంలో కలిసి నటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి కంగనా రనౌత్ గెలుపొందారు.

ఇది కూడా చదవండి: Groom Strange Dance: ఏంటి భయ్యా.. పెళ్లి నీదేనని మర్చిపోయావా.. ఇలా రెచ్చిపోయావు..