Site icon NTV Telugu

Kangana Raunat: రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన కంగనా రనౌత్..

Kangana

Kangana

బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ నిన్న ( అక్టోబర్ 24న ) దసరా వేడుకల సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన మొదటి మహిళగా ఈ ఘనత సాధించింది. కంగనాతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రావణ, కుంభకరణ్, మేఘనాథుల దిష్టిబొమ్మలను కంగనా దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎర్రటి చీర కట్టుకుని చాలా అందంగా కనిపించారు.

Read Also: Astrology: అక్టోబర్‌ 25, బుధవారం దినఫలాలు

అయితే, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఢిల్లీలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసిన తొలి మహిళగా కంగనా రనౌత్ చరిత్ర సృష్టించింది. రాంలీలా మైదానంలో రావణ దహనంతో పాటు శ్రీరాముడి మహిమను కంగనా కొనియాడింది. ‘శ్రీరాముడు ఉంటే మనం ఉన్నాం.. ఆయనలాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు.. మళ్లీ రారు అని చెప్పింది. ఆ తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ రావణుడిని దహనం చేశారు. బాణసంచా కాల్చడం నిషేధించాలన్న ప్రభుత్వ ఆదేశంతో.. రామ్ లీలా మైదానం అంతటా శబ్ధం వినిపించే విధంగా ఎనిమిది ట్రాక్‌ల డిజిటల్‌ డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌ ద్వారా బాణాసంచా శబ్దాన్ని రికార్డు చేశారు.

Read Also: Minister KTR: చావాలా.. బతకాలా నేనేం చేయాలి.. విచిత్ర అనుభవాన్ని చెప్పిన కేటీఆర్‌

ఇక, కంగనా నటించిన తేజస్ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమో మాట్లాడుతూ.. శ్రీరాముడు చెడుపై మంచి విజయ పతాకాన్ని ఎగురవేసినట్లే మన దేశ సైనికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి మనందరినీ కాపాడుతున్నారని అన్నారు. ఆర్‌ఎస్‌విపి నిర్మిస్తున్న తేజస్‌లో కంగనా రనౌత్ కథానాయికగా నటిస్తోంది. సర్వేష్ మేవాడా రచన మరియు దర్శకత్వం వహించారు మరియు రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 27 న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

Exit mobile version