Kangana Ranaut: దుమారం రేపుతున్న సుభాష్ చంద్రబోస్‌పై వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి, మండీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఏదొక వివాదం సృష్టిస్తుంటారు. తాజాగా భారత తొలి ప్రధానిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
కంగనా రనౌత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తొలి ప్రధాని బోస్ ఎక్కడికి వెళ్లారు..? అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దేశం కోసం పోరాడిన ఆయన్ను దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని అన్నారు. అయితే వ్యాఖ్యాత ఆమె మాటలను సరిచేశారు. కంగనా ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి వారి మాటలు తేలిగ్గా తీసుకోవద్దని, వీరంతా ఎక్కడ చదువుకున్నారంటూ విపక్ష నేతలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె విద్యాశాఖ మంత్రి అయితే పరిస్థితి ఏంటో..? అంటూ కామెంట్లు పెట్టారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
గతంలోనూ కంగనా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాతే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌తో విమర్శల పాలయ్యారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అప్పట్లో పలువురు నేతలు డిమాండ్ చేశారు.
కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారం ప్రారంభించారు. ఒక నటిగా కాకుండా.. మీ బిడ్డగా తనను ఆదరించాలని ప్రజలను కోరుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!