Site icon NTV Telugu

Kangana Ranaut: హాలీవుడ్ సినిమాలో కంగనా

Kangana Ranaut

Kangana Ranaut

కంగనా రనౌత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ఆమె బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూ, ఏకంగా ఇప్పుడు బిజెపి ఎంపీగా వ్యవహరిస్తోంది. ఆమె చివరిగా ఎమర్జెన్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటే, దారుణంగా ప్రేక్షకులు దాన్ని తిప్పికొట్టారు. ఇక తాజాగా ఆమె ఒక హాలీవుడ్ సినిమాలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. బ్లెస్డ్ బై ది ఈవిల్ అనే సినిమాలో ఆమె నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా ఒక హారర్ డ్రామా అని, ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Read More: Vijay Devarakonda : ఆర్మీకి రౌడీ బ్రాండ్ దుస్తులు.. ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ..

టైలర్ పోసీ, స్కార్లెట్ రోస్ వంటి వారితో ఈ సినిమాలో ఆమె నటించబోతోంది. ఈ సినిమాను లయన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే న్యూయార్క్‌లో షూటింగ్ జరగబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన సింహభాగం షూటింగ్ అమెరికాలోనే జరగబోతోంది. గతంలో టైలింగ్ పాండ్, న్యూ మీ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన అనురాగ్ రుద్ర ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే, సినిమాకు కొంతమంది టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. నిజానికి, ఎంపీ అయిన తర్వాత కంగనా రనౌత్ ఎలాంటి బాలీవుడ్ ప్రాజెక్ట్‌నూ ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఆమె ఈ సినిమాలో భాగమైనట్లు చెబుతున్నారు.

Exit mobile version