Site icon NTV Telugu

Kangana Ranaut :బిల్కిస్ బానోపై సినిమా తీస్తా..స్క్రిప్ట్ కూడా సిద్ధంగా వుంది.. కానీ

Whatsapp Image 2024 01 09 At 3.18.36 Pm

Whatsapp Image 2024 01 09 At 3.18.36 Pm

బిల్కిస్ బానో రేప్ కేసు లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన 11 మందిని తిరిగి జైలుకు పంపించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.రెండు వారాల్లోగా జైలుకు తరలించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.2002 గుజరాత్ అల్లర్లలో 5 నెలల గర్భిణీ గా ఉన్న 21 ఏళ్ల బిల్కిస్ బానో పై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె మూడేళ్ల కూతురితోపాటు ఏడుగురు కుటుంబ సభ్యుల్ని హత్య చేశారు. ఈ కేసు లో సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందిని దోషులుగా ఖరారు చేస్తూ 2008 లో జీవిత ఖైదును విధించింది. ఆ తరువాత బోంబే హైకోర్టు కూడా ఈ తీర్పు ను సమర్ధించింది. కాగా 15 ఏళ్ల జైలు శిక్ష అనంతరం తమను విడుదల చేయాలని కోరుతూ ఓ దోషి 2022 లో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే..పరిశీలించాల్సిందిగా గుజరాత్ ప్రభుత్వాన్ని కోరింది.

కోర్టు సూచనతో గుజరాత్ ప్రభుత్వం ఓ కమిటీ నియమించి ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా 11 మందికి రెమిషన్ విదించడంతో 2022 ఆగస్టు 15 న అంతా విడుదలయ్యారు.దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. గుజరాత్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. వాళ్లను తిరిగి జైలుకు పంపించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది.ఇదిలా ఉంటే ఓ సోషల్ మీడియా యూజర్ బిల్కిస్ బానో పై సినిమా తీస్తారా అని కంగనాను ప్రశ్నించాడు.అయితే బిల్కిస్ బానో స్టోరీ ని సినిమా గా తీయడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించింది. ఈ మూవీ తీయడానికి తన దగ్గర స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నా ఎవరూ నిర్మించడానికి ముందుకు రావడం లేదని ఆమె చెప్పుకొచ్చింది.నిజానికి మూడేళ్లపాటు రీసెర్చ్ కూడా చేసినట్లు కంగనా సదరు యూజర్ కు చెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్ కు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ముందుకు రావడం లేదని ఆమె చెప్పింది

Exit mobile version