NTV Telugu Site icon

Kangana Ranaut : ప్రత్యక్ష రాజకీయాలలోకి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్..క్లారిటీ ఇచ్చిన కంగనా తండ్రి అమర్‌దీప్‌..

Whatsapp Image 2023 12 20 At 5.00.13 Pm

Whatsapp Image 2023 12 20 At 5.00.13 Pm

ప్రస్తుతం ఎందరో సినీ సెలబ్రిటీలు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సర్వ సాధారణం. ఇప్పటికే తమ సినిమాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చాలా మంది స్టార్ నటి నటులు తమ పొలిటికల్‌ జర్నీని మొదలుపెట్టారు.చాలామంది నటి నటులు ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు కూడా వెళ్లారు. మరికొందరు వివిధ పార్టీ ల్లో కొనసాగుతూ ప్రజల తరుపున తమ గొంతు వినిపిస్తున్నారు. తాజాగా ఈ గ్లామర్‌ ప్రపంచంలో నుంచి మరో తార తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టేందుకు రెడీ అయింది. ఇంతకీ ఆ భామ ఇంకెవరో కాదు.. బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్. ఈ భామ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్థాయి లో ఇమేజ్‌ సొంతం చేసుకుంది. సామాజిక సమస్యలపై తనదైన శైలి లో స్పందించే కంగనారనౌత్‌ నిత్యం ఏదో ఒక కామెంట్స్‌ తో హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది.

అయితే కంగనా రనౌత్‌ ఫైనల్‌ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయమై కంగనా తండ్రి అమర్‌దీప్‌ రనౌత్‌ క్లారిటీ ఇచ్చేశారు.కంగనా రనౌత్‌ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని అమర్‌దీప్‌ స్పష్టం చేశారు. కంగనా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తుందని, ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తుందనేది పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు.. కొన్ని రోజుల క్రితం కంగనా రనౌత్‌ ద్వారకలోని శ్రీ కృష్ణుడి ఆలయం లో పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెను రాజకీయాల్లోకి వస్తున్నారా..వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా.. అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికీ స్పందిస్తూ ఆ కృష్ణ భగవానుడు ఆశీర్వదిస్తే తప్పక పోటీ చేస్తానంటూ ఆమె చెప్పుకొచ్చింది.అయితే కంగనా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుందనేది తెలియాల్సి వుంది.అయితే కంగనారనౌత్‌ హిమాచల్ ప్రదేశ్‌ లోని తన సొంత నియోజకవర్గం మండి నుంచి పోటీ చేస్తుందని కొన్ని వార్తలు వస్తున్నాయి.

Show comments