NTV Telugu Site icon

Kanakamedala: ఏపీ పునర్విభజన హామీలు పూర్తి చేయాలని కోరాం..

Kanakamedala

Kanakamedala

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పార్లమెంటు లైబ్రరీ భవన్‌లో అఖిల పక్ష సమావేశం జరిగింది. రాజ్ నాథ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ బిజినెస్ పై మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరించామని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. ఐపీసీ, సీఆర్పీసీ, సీపీసీ రీప్లేస్ తో పాటు జమ్మూ కాశ్మీర్ బిల్లులను కేంద్రం ప్రస్తావించింది అని ఆయన చెప్పారు. 22 పార్టీలు అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నాయి.. టీడీపీ తరపున అఖిలపక్ష సమావేశంలో పలు అంశాలను లేవనెత్తాను.. ఏపీ ప్రభుత్వం పునర్విభజన పట్ల నిర్లక్షం వహించింది.. దాంతో అభివృద్ధి జరగలేదు అని కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు.

Read Also: Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..

ఇక, మిగిలింది ఆరు నేలలు మాత్రమే.. అందుకే విభజన హామీలు పూర్తి చేయాలని కోరామని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు. పోలవరం పూర్తి చెయ్యాలి.. రాష్ట్ర రాజధాని లేకుండా ఉంది.. పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడ్డ క్యాపిటల్ ను మారుస్తున్నారు.. ఆర్థిక పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాలి అని ఆయన కోరారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు.. రాష్ట్రాల్లో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే కేంద్రం జోక్యం చేసుకోవాలి.. కక్ష్య సాధింపుతో వ్యవహరిస్తున్నారు.. పాత ప్రభుత్వ నిర్ణయాలపై, కొత్త ప్రభుత్వం చేసే కక్ష్య సాధింపుపై పార్లమెంట్ లో చర్చ జరగాలి అని కనకమేడల రవీంద్ర కుమార్ చెప్పుకొచ్చారు.

Read Also: Krishna Water Issue: మినిట్స్ రూపంలో విడుదల చేస్తాం… కృష్ణా నీటిపై సీడబ్ల్యూసీ క్లారిటీ..

ఏపీలో ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకొని ఓటర్లను తొలగిస్తున్నారు అని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. దొంగ ఓట్లను చేరుస్తున్నారు.. ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరాం.. సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వాలని చెప్పాం.. ఏపీలో కరువు అంశం ఉంది.. కేంద్రం పరిష్కరించాలని అడిగామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో విఫలం అవడం వల్ల.. కేంద్ర పథకాల నిధులు వెనక్కి పోతున్నాయి.. అనేక ప్రాజెక్టులు ఏపీలో మూలన పడ్డాయి.. ఇక మిగిలింది.. ఆర్నేళ్లే.. అందుకే విభజన హామీలు పూర్తి చెయ్యాలని కోరామని టీడీపీ ఎంపీ కనకమేడల వెల్లడించారు.