Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి తరహా సీన్ రిపీట్.. పెళ్లికి నో చెప్పిందని యువతికి ‘ఎయిడ్స్ రక్తం’ ఇంజెక్ట్!

Kamareddy Pocharam

Kamareddy Pocharam

Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్‌కు ఆమె తండ్రి హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇస్తాడు. ప్రేమించిన వాడిని మర్చిపోకపోవడంతో కూతురిని చంపేయాలని కన్నతండ్రే ఇలా చేస్తాడు. అచ్చం అలాంటి ఘటన కామారెడ్డి జిల్లా పోచారంలో చోటు చేసుకుంది. ఇక్కడ విలన్ తండ్రి కాదు.. పెళ్లి ఫిక్స్ అయిన యువకుడు. తనతో పెళ్లికి నిరాకరించిన యువతికి యువకుడు ఎయిడ్స్‌ రక్తాన్ని ఎక్కించాడు. యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్‌ ఉంది. పోచారానికి చెందిన యువకుడి మనోహర్‌తో యువతికి వివాహం నిశ్చయమైంది. ఎయిడ్స్‌ ఉందని తేలడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. ఈనెల 11న యువతి ఇంటికి వెళ్లాడు మనోహర్.. తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతిపై మనోహర్ ఒత్తిడి తెచ్చాడు. పెళ్లికి నిరాకరించడంతో ఎర్రటి ఇంజెక్షన్ వేశాడు. అంటే ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు. ప్రస్తుతం పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

READ MORE: Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?