NTV Telugu Site icon

Thug Life : కమల్ ‘థగ్ లైఫ్’ షూట్ లో ప్రమాదం..ఆ స్టార్ యాక్టర్ కు గాయాలు.

2

2

Thug Life : విశ్వనటుడు కమల హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “..స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాడు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్ ” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటించారు.అలాగే ఈ సినిమాలో ఎస్.జె .సూర్య ,బాబీ సింహా ,సముద్రఖని వంటి స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే కమల్‌హాసన్‌ నటిస్తున్న మరో మూవీ “థగ్‌ లైఫ్‌”..తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Read Also:Raashii Khanna: ట్రెండీ డ్రెస్సులో కళ్ళు చెదిరే అందాలతో అలరిస్తున్న రాశి ఖన్నా

ఈ సినిమా కమల్ హాసన్ 234 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ మూవీలో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు, గౌతమ్‌ కార్తీక్‌, దుల్కర్ సల్మాన్‌, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.పాపులర్ మాలీవుడ్ యాక్టర్‌ జోజు జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం పాండిచ్చేరి ఎయిర్‌పోర్టులో ఈ మూవీకి సంబంధించి యాక్షన్‌ సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా హెలికాప్టర్‌ జంపింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా.. జోజు జార్జ్‌ ఎడమకాలికి గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.డాక్టర్లు నటుడు జోజు జార్జ్‌ కాలికి పట్టీని వేయగా స్టిక్‌ సాయంతో నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Show comments