Shivaji: తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ల దుస్తుల ఎంపిక మరియు నైతికతపై జరుగుతున్న చర్చ ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. ఇటీవల జరిగిన ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ టాలీవుడ్ హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపగా, దానిపై నటుడు కమల్ కామరాజు తన సోషల్ మీడియా వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించారు. మహిళల గౌరవం వారి దుస్తులపై ఆధారపడి ఉండదని ఆయన కుండబద్దలు కొట్టారు.
50MP+50MP+50MP కెమెరా సెటప్, 6000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో Huawei Nova 15 లాంచ్..!
మహిళల బట్టలు అనేవి పురుషుల ఆమోదం కోసం లేదా వారిని ఆహ్వానించడానికి కాదని కమల్ కామరాజు స్పష్టం చేశారు. “ఒక మహిళ ఏం వేసుకోవాలనేది ఆమె పర్సనల్ ఛాయిస్. అది మగవారి తీర్పుకోసం కాదు” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కొందరు తమ వ్యక్తిగత అభిప్రాయాలను “మగవారందరూ ఇలాగే ఆలోచిస్తారు” అని సాధారణీకరించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
శివాజీ తన ప్రసంగంలో వాడిన కొన్ని పదజాలంపై కమల్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. “దరిద్రపుగొట్టు…” వంటి పదాలను ఉపయోగించడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆలోచనా విధానంలోని లోపాన్ని తెలియజేస్తుందని, అది మహిళల తప్పు కాదని ఆయన అన్నారు. సంస్కృతి పేరుతో మహిళలపై నియంత్రణ ప్రదర్శించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
Anantapur: కసాయి తండ్రి కిరాతకం.. ఇద్దరు కూతుర్లను తుంగభద్ర కాలువలో తోసివేత.. చివరకు..?
మహిళల శరీరాలను, వారి దుస్తులను లేదా వారి ఎంపికలను ‘మొరల్ పోలీసింగ్’ చేసే హక్కు పురుషులకు లేదని కమల్ కామరాజు తేల్చి చెప్పారు. గౌరవం అనేది మహిళ వేసుకునే దుస్తుల నుండి రాదని, అది చూసే పురుషుడి ఆలోచనల నుండి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. “మహిళలను ప్రశాంతంగా ఉండనివ్వండి. వారి దుస్తుల విషయంలో జోక్యం చేసుకోవడం ఆపండి. విలువల పేరుతో చేసే దూషణలను సమర్థించవద్దు.” అని కమల్ కామరాజు అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి అంశాలపై మౌనంగా ఉండటం అటువంటి ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని, అందుకే తాను గళం విప్పుతున్నట్లు ఆయన తెలిపారు. కమల్ చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో కొందరి నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తూ స్పందిస్తున్నారు.
