Site icon NTV Telugu

Thug Life : కమల్ ‘ థగ్ లైఫ్ ‘ షూటింగ్ అప్డేట్ వైరల్..

Kamalhasan

Kamalhasan

Thug Life  : విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ,రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్స్ పై ఉదయనిధి స్టాలిన్ మరియు సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఎస్.జె.సూర్య ,బాబయ్ సింహ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందించారు.

Read Also :Nayanthara-Vignesh Shivan: పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్!

ఇండియన్ 2 సినిమాను మేకర్స్ జులై 12 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇండియన్ 2 రిలీజ్ అయిన 6 నెలలకు ఇండియన్ 3 సినిమాను రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.ఇదిలా ఉంటే కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “థగ్ లైఫ్ “..ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నారు.కమల్,మణిరత్నం కాంబినేషన్ లో 37 ఏళ్ళ తరువాత  వస్తున్న సినిమానే “థగ్ లైఫ్ “..ఈ సినిమాను కమల్ హాసన్ ,ఆర్ మహేంద్రన్ ,మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో శింబు కీలక పాత్ర పోషిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది.థగ్ లైఫ్ షూటింగ్ 60 % షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది.మరో 40 రోజుల్లో మిగిలిన షూటింగ్  పూర్తి చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది.

Exit mobile version