NTV Telugu Site icon

Kamal Haasan: ఆ సినిమా టికెట్‌ కోసం కొన్ని వారాల పాటు ఎదురు చూశా!

Kamal Haasan Show Le Ticket

Kamal Haasan Show Le Ticket

Kamal Haasan recalls the first day of the movie Show Le: ‘షోలే’ సినిమా టికెట్‌ కోసం తాను కొన్ని వారాల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని లోకనాయకుడు కమల్‌హాసన్‌ తెలిపారు. అప్పట్లో షోలే సినిమాని చూసిన అభిమానులకంటే ఎక్కువగా.. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ని చూస్తారన్నారు. బుధవారం ముంబైలో కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన కమల్‌హాసన్‌.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన షోలే చిత్రం 1975 విడుదలై ఎన్నో రికార్డులు నెలకొల్పింది.

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో రానా హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్‌ను అమితాబ్‌కు అశ్వినీదత్‌ అందించగా.. బిగ్‌బీ నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్‌ను ఇవ్వాలనుకుంటే.. ఎవరికి ఇస్తారు? అని అమితాబ్‌ను రానా అడగ్గా.. కమల్‌హాసన్‌ పేరు చెప్పారు. అమితాబ్‌ నుంచి టికెట్‌ను తీసుకున్న కమల్‌.. షోలే సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

Also Read: Deepika Padukone-Prabhas: బేబి బంప్‌పై దీపికా పదుకొణె ఫన్నీ కామెంట్స్!

‘ఇలా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్‌ని పొందే అవకాశం షోలే సినిమాకి వస్తే బాగుండేది. ఎందుకంటే కొన్ని వారాల పాటు ఆ సినిమా టికెట్‌ కోసం ఎదురు చూశా. అప్పట్లో ఆ సినిమాని చూసిన అభిమానులకంటే ఎక్కువగా ఇప్పుడు కల్కిని చూస్తారు. నా గురువు, మార్గదర్శి బాలచందర్‌ లాగా అసాధారణమైన మనుషులు చాలా సాధారణంగా ఉంటారు. అలాంటి వాళ్లతో మాట్లాడేవరకూ వాళ్లపై ఓ అభిప్రాయానికి రాను. సాధారణమైన వ్యక్తిలాగే ఉన్న నాగ్‌ అశ్విన్‌.. కథ చెప్పడంలో నేర్పుని చూసి ఆశ్చర్యపోయా. సినిమాను అంతే నేర్పుగా తెరపైకి తీసుకొచ్చాడు’ అని కమల్‌హాసన్‌ చెప్పారు.