NTV Telugu Site icon

Kamal Haasan: అభిమానులకు కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన కమల్

Kamal

Kamal

Kamal Haasan Tweet on Amaran movie: దీపావళి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించాయి. అమరన్, లక్కీ భాస్కర్, క, భగిర సినిమాలు విడుదలయ్యి అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఇకపోతే, నటుడు కమల్ హాసన్ నిర్మతగా వ్యవహరించిన సినిమా ‘అమరన్’. యాక్షన్ సెంటిమెంట్ మిలిటరీ బ్యాక్ గ్రౌండ్ గా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.

Reed Also: Priyanka Gandhi: రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేయనున్న ప్రియాంక గాంధీ

ఇకపోతే, కమలహాసన్ తాజాగా అమరన్ సినిమా విజయం పై ఆనందం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సినీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. అందులో భాగంగా విడుదలైన అన్ని చోట్ల అమరన్ సినిమాకు మంచి ఆదరణ దక్కిందని.. కొన్ని సినిమాలు ఆనందాన్ని ఇస్తాయని, మరికొన్ని గౌరవాన్ని తీసుకొస్తాయని తెలిపాడు. మరికొన్ని సినిమాలు గర్వపడేలా చేస్తాయని చెబుతూ.. అమరన్ సినిమా ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తుందని తెలిపాడు. ఈ విషయం తాను సినిమా ప్రారంభ సమయంలోనే చెప్పానని.. దీనికోసం సినిమా సభ్యులు దాదాపు మూడేళ్లు శ్రమించారని చెబుతూ, మంచి చిత్రాన్ని ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటారని నా నమ్మకం మరోసారి నిజమైందంటూ ఆయన పేర్కొన్నారు.

Reed Also: Nara Bhuvaneswari: రామ్ సినిమా రంగంలోకి వస్తునందుకు థ్రిల్లింగ్ గా ఉంది

Show comments