Site icon NTV Telugu

Bharateeyudu 2 Twitter Review: ‘భారతీయుడు 2’ ట్విట్టర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?

Bharateeyudu 2 Twitter Review

Bharateeyudu 2 Twitter Review

Kamal Haasan’s Bharateeyudu 2 Twitter Review: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు 2’. 27 ఏళ్ల క్రితం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’కు ఇది సీక్వెల్‌. ఈ సినిమాను లైకా సంస్థ, రెడ్ జెయింట్ సంస్థ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించింది. కమల్‌ హాసన్‌ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య నేడు భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల ఫస్ట్ షోలు పూర్తయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

భారతీయుడు 2 చిత్రంకు మిక్స్‌డ్ టాక్‌ వస్తోంది. ‘సినిమా బాగానే మొదలైంది. సినిమా ఊహాజనితంగా మరియు బోరింగ్‌గా ఉంది. ఎక్సైటింగ్ సీన్స్ లేవు. సెకండ్ హాఫ్ బాగుంటేనే సినిమా నిలబడుతుంది’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘శంకర్ తీసిన వరెస్ట్ సినిమా ఇదే. మూడున్నర గంటలు వేస్ట్ చేసుకున్నా’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ‘శంకర్ గారు తన ఆస్థాన రచయిత సుజాత గారిని మిస్ అవుతున్నారేమో. ఆయన చనిపోయాక గట్టిగా దెబ్బ పడింది’ అని నెటిజెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read: Rohit Sharma Prize Money: రాహుల్‌ ద్రవిడ్‌ కంటే ముందే.. రూ.5 కోట్లు వదులుకునేందుకు సిద్దమైన రోహిత్‌!

ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్‌గా ఉందని చాలామంది కామెంట్స్ చేస్టున్నారు. శంకర్ అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో విసిగించాడని అంటున్నారు. డైరెక్టర్ శంకర్ అవుట్ డేటెడ్ అని అంటున్నారు. ట్విట్టర్‌లోని ఈ టాక్ నిజమేనా? అని తెలియాలంటే ఇంకో 2-3 గంటల వరకు ఆగాల్సిందే. భారతీయుడు 2లో సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, ఎస్ జే సూర్య, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

Exit mobile version