ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు వైఎస్ఆర్ కల్యాణ మస్తు, షాదీతోపా మూడో విడత ఆర్థిక సాయాన్ని నేడు విడుదల చేయనుంది. ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న జంటలకు ఆర్ధిక సాయం అందివ్వనున్నారు. ఇవాళ( బుధవారం ) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా నిధులను లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు.
Read Also: World Cup 2023: ప్రపంచకప్ 2023కి భారత్ జట్టు ఇదే.. రాహుల్, అయ్యర్ ఎంట్రీ! మరో అనూహ్య ఎంపిక
అయితే, రాష్ట్రంలో కులాంతర వివాహాం చేసుకున్న వారికి పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో ఏపీ సర్కార్ డబ్బులు జమ చేయనుండగా.. మిగతా లబ్ధిదారులకు తల్లుల అకౌంట్‌లో జమ చేస్తుంది. నిన్ననే (మంగళవారం) ఈ డబ్బులను విడుదల చేయాల్సి ఉండగా.. వరద బాధితులను పరామర్శించేందుకు గత రెండు రోజులుగా వివిధ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.. కాబట్టి ఇవాళ్టికి కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
Read Also: Astrology: ఆగస్టు 09, బుధవారం దినఫలాలు
ఇక, ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల ఫ్యామిలీలోని పిల్లలు వివాహం చేసుకుంటే వారికి జగన్ సర్కార్ ఆర్ధిక సాయం అందిస్తుంది.
ఎస్టీలకు రూ.లక్ష, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.లక్షా 20 వేలు, బీసీలకు రూ.50 వేలు, బీసీ కులాంతర వివాహం చేసుకున్నవారికి రూ.75 వేలు, ఎస్సీలకు రూ.లక్ష, ఎస్సీ కులాంతర వివాహం చేసుకున్నవారికి రూ.లక్షా 20 వేలు, అలాగే మైనార్టీలకు రూ.లక్ష సాయం అందిస్తుంది. ఇక విభిన్న ప్రతిభావంతులకు రూ.లక్షా 50 వేలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని వారికి రూ.40 వేలు వైఎస్ఆర్ కల్యాణ్ మస్తు, షాదీ తోఫా పథకం కింద ఏపీ ప్రభుత్వం సహాయం చేస్తుంది.
Read Also: Subramanya Stotram: ఆడి కృత్తిక వేళ ఈ అభిషేకం వీక్షిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి
అయితే, ఈ పథకంలో లబ్ది పొందాలంటే వధూవరులిద్దరూ తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి.. ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. వివాహమైన తర్వాత 30 రోజుల్లోగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం లబ్ధిదారులకు సాయం అందిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు రెండో విడతల సాయం అందించగా.. ఇప్పుడు మూడో విడత నిధులను విడుదల చేస్తుంది. పేదింటి పిల్లల వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోన్నట్లు సీఎం జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకోవాలి.. పెళ్లి చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా ఇతర ఆధారాలు అందించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.