Dwaraka Tirumala: ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయం భక్తులకు షాకింగ్ న్యూస్ చెప్పింది.. చిన వెంకన్న ఆలయంలో కల్యాణ మండపాల అద్దెలు భారీగా పెంచింది.. ఇప్పటి వరకు కల్యాణ మండపాల అద్దె రూ.800గా ఉండగా.. ఇప్పుడు రూ.800 నుండి రూ.5 వేల వరకు పెంచనున్నట్టు అధికారులు ప్రకటించారు.. అయితే, పెరిగిన అద్దేపై అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలపాలని భక్తులకు సూచించింది ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయ పాలకమండలి.. కాగా, చిన వెంకన్న ఆలయంలో పెద్ద సంఖ్యలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి.. శుభముహూర్తాలు వచ్చాయంటే చాలు.. పెళ్లిళ్లు చేసుకుని జంటలు క్యూ కడుతుంటాయి. కానీ, రూ.800గా ఉన్న కల్యాణ మండపాల అద్దెను ఒకేసారి రూ.5వేలకు పెంచడంపై భక్తులల నుంచి విమర్శలు వస్తున్నాయి.
Read Also: BRS KTR: బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారు..
మరోవైపు.. ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన ఉద్యోగులపై దేవస్థానం అధికారులు చర్యలు తీసుకున్న విషయం విదితమే.. ఓ ఉద్యోగిని సస్పెండ్ చేసి, సంబంధిత అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేసి, పలువురు సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఆలయ కేశాఖండనశాలలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు సిద్ధవటం యానాదయ్య ఆధ్వర్యంలో వైసీపీ ‘సిద్ధం’ పేరుతో ముద్రించిన కరపత్రాలను అక్కడ విధులు నిర్వహిస్తున్న క్షురకులకు పంపిణీ చేయడం దుమారం రేపింది.. ఆ కరపత్రాలను క్షురకులు చేతితో పట్టుకొని ఫొటోలు దిగి దేవస్థానంలో ప్రచారం చేయడంతో వారిపై చర్యలకు పూనుకున్న విషయం విదితమే.