Site icon NTV Telugu

క్యాన్సర్‌ మహమ్మారిపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించే బాధ్యత సమాజంలో మనందరిపై ఉందని తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జె క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాక్’ ను ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. గతంలో 60 ఏండ్ల పైబడిన వాళ్లకు వచ్చే క్యాన్సర్ ఇప్పుడు 30 సంవత్సరాలకే వస్తున్నదని, కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కుటుంబ సభ్యుల మీద కూడా ఉందని వెల్లడించారు.

ఆడ పిల్లలకు తప్పకుండా ఏడాదికి ఒకసారి క్యాన్సర్ పరీక్షలు చేయించడంతో పాటు, జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలని సూచనలు చేశారు. తల్లి, చెల్లి, భార్య ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉందని..తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎమ్ ఎన్ జే క్యాన్సర్ హాస్పటల్ లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన ఆసుపత్రి ఇంచార్జీ జయలలితకు ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపారు.

Exit mobile version