Ex CM Wife: కంటతడి పెట్టిన మాజీ సీఎం భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కల్పనా సోరెన్.. తన భర్తను తలచుకుని స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగిస్తూ తన భర్త, మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
రాంచీలో జరిగిన జేఎంఎం (JMM) కార్యక్రమంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు ఆపుకోలేకపోయారు. అనంతరం భర్త హేమంత్ సోరెన్ (Hemant Soren)ను తలుచుకుని కల్పనా సోరెన్ (Kalpana Soren) కంటతడి పెట్టారు.
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
బరువెక్కిన హృదయంతో తాను ఈరోజు మీ ముందున్నానని కల్పన తెలిపారు. మా మామగారు (శిబు సోరెన్), మా అత్తగారు అయితే.. కుమారుడిని తలుచుకుని ఎంతో ఆవేదనకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. ఇకపై తనకు బలం కార్యకర్తలేనని కల్పనా సోరెన్ చెప్పుకొచ్చారు.
పొలిటికల్ ఎంట్రీ..
జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం కల్పన ప్రకటించారు.
ఈ రోజు తన పుట్టినరోజు అని. అత్తమామల ఆశీస్సులు తీసుకున్నానని.. అలాగే భర్తను కూడా ఉదయం కలుసున్నట్లు కల్పనా సోరెన్ సోమవారం ఒక ట్వీట్లో తెలిపారు. అనంతరం జేఎంఎం ‘ఫౌండేషన్ డే’లో ఆమె పాల్గొన్నారు. జార్ఖండ్ ప్రజల అభీష్టం మేరకే తాను ప్రజాజీవితంలోకి అడుగుపెట్టానని, హేమంత్ సోరెన్ తిరిగి వచ్చేంత వరకూ ఆయన ఆలోచనలు, ప్రజాసేవను తాను కొనసాగిస్తానని కల్పన ప్రకటించారు.

మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అరెస్ట్‌కు ముందు కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని వార్తలు వినింపించాయి. కానీ సొంతింటి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. తోడికోడలే కల్పనా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో హేమంత్ వారసుడుగా చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ జరిగిన బలపరీక్షలో కూడా ఆయన నెగ్గారు. మొత్తానికి కల్పనా సోరెన్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మరీ త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కల్పనా పోటీ చేస్తారో.. లేదో చూడాలి.
#WATCH | At an event in Giridih, Kalpana Soren – wife of former Jharkhand CM Hemant Soren – breaks down as she speaks about him. pic.twitter.com/3tDGMpAGPO
— ANI (@ANI) March 4, 2024
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!