Site icon NTV Telugu

Ex CM Wife: కంటతడి పెట్టిన మాజీ సీఎం భార్య

Kalpana

Kalpana

కల్పనా సోరెన్.. తన భర్తను తలచుకుని స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగిస్తూ తన భర్త, మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

రాంచీలో జరిగిన జేఎంఎం (JMM) కార్యక్రమంలో ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు ఆపుకోలేకపోయారు. అనంతరం భర్త హేమంత్ సోరెన్‌ (Hemant Soren)ను తలుచుకుని కల్పనా సోరెన్ (Kalpana Soren) కంటతడి పెట్టారు.

బరువెక్కిన హృదయంతో తాను ఈరోజు మీ ముందున్నానని కల్పన తెలిపారు. మా మామగారు (శిబు సోరెన్), మా అత్తగారు అయితే.. కుమారుడిని తలుచుకుని ఎంతో ఆవేదనకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. ఇకపై తనకు బలం కార్యకర్తలేనని కల్పనా సోరెన్ చెప్పుకొచ్చారు.

పొలిటికల్ ఎంట్రీ..
జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆదివారం కల్పన ప్రకటించారు.

ఈ రోజు తన పుట్టినరోజు అని. అత్తమామల ఆశీస్సులు తీసుకున్నానని.. అలాగే భర్తను కూడా ఉదయం కలుసున్నట్లు కల్పనా సోరెన్ సోమవారం ఒక ట్వీట్‌లో తెలిపారు. అనంతరం జేఎంఎం ‘ఫౌండేషన్‌ డే’లో ఆమె పాల్గొన్నారు. జార్ఖండ్ ప్రజల అభీష్టం మేరకే తాను ప్రజాజీవితంలోకి అడుగుపెట్టానని, హేమంత్ సోరెన్ తిరిగి వచ్చేంత వరకూ ఆయన ఆలోచనలు, ప్రజాసేవను తాను కొనసాగిస్తానని కల్పన ప్రకటించారు.

 

మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అరెస్ట్‌కు ముందు కల్పనా సోరెన్‌ను ముఖ్యమంత్రిని చేస్తారని వార్తలు వినింపించాయి. కానీ సొంతింటి నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు సమాచారం. తోడికోడలే కల్పనా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో హేమంత్ వారసుడుగా చంపయ్ సోరెన్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం అసెంబ్లీ జరిగిన బలపరీక్షలో కూడా ఆయన నెగ్గారు. మొత్తానికి కల్పనా సోరెన్‌ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మరీ త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కల్పనా పోటీ చేస్తారో.. లేదో చూడాలి.

 

Exit mobile version