NTV Telugu Site icon

Kalki 2898 AD : ఓవర్సీస్ లో ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్..కేవలం నాలుగు గంటల్లోనే ఏకంగా..?

Kalki (1)

Kalki (1)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు.ఈ నెల 10 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also :OG : భారీ ధరకు సేల్ అయిన ‘ఓజి’ ఓటీటీ రైట్స్..?

ఈ సినిమా ట్రైలర్ పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉంటే కల్కి ఓవర్సీస్ ప్రీమియర్స్ ను జూన్ 26 నే వేయనున్నారు.అయితే ఓవర్సీస్ ప్రీమియర్స్ కు సంబంధించి అడ్వాన్సు బుకింగ్ గురువారం ఓపెన్ అవ్వడం జరిగింది.ఓవర్సీస్ లో ప్రభాస్ కల్కికి మాములు క్రేజ్ లేదు.బుకింగ్ ఓపెన్ చేసిన 4 గంటలలోనే ఏకంగా 4200 మూవీ టికెట్స్ హాట్ కేక్స్ లా సేల్ అయ్యాయి.దీనితో తొలి రోజు అడ్వాన్సు  బుకింగ్ ద్వారా ఏకంగా కోటి పది లక్షల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం.రిలీజ్ కు ముందే రికార్డ్స్ సృష్టిస్తున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.